News


మొబీక్విక్‌తోనూ పసిడి కొనుగోళ్లు!

Tuesday 23rd October 2018
news_main1540270939.png-21390

న్యూఢిల్లీ: ఇక వినియోగదారులు ఈ-వాలెట్‌ సంస్థ మొబీక్విక్‌ ద్వారా కూడా  డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. పేటీఎం తరువాత ఈ తరహా అవకాశాన్ని మొబీక్విక్‌ కల్పిస్తోంది. తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా 2019-2020లో టన్ను పసిడి అమ్మకాలు లక్ష్యంగా మొబీక్విట్‌ తాజా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సేఫ్‌గోల్డ్‌తో మొబీక్విట్‌ జట్లుకట్టింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్లు పసిడి కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. ఫిజికల్‌ డెలివరీ కూడా తీసుకోవచ్చు.  ఈ తాజా చొరవలో భాగంగా మొబీక్విక్‌ తన యాప్‌పై ‘గోల్డ్‌’ పేరుతో ప్రత్యేక కేటగిరీనీ ఏర్పాటు చేసింది. ‘‘అన్ని రకాల ఆర్థిక సేవలూ అందించాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగానే తాజా చొరవను సంస్థ ప్రారంభించింది. రుణాలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌   తర్వాత సంస్థ ప్రారంభించిన తాజా సేవలు ఇవి’’ అని మొబీక్విక్‌ తెలిపింది. రూపాయి విలువ  నుంచీ లేదా గ్రాముల్లో 99.5 శాతం ప్యూరిటీ, 24 క్యారెట్‌ గోల్డ్‌ కొనుగోలుకు అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. అలాగే వినియోగదారులు అప్పటికి కొద్ది వారాల నుంచీ పసిడి ధరల ధోరణి ఎలా ఉందో తెలుసుకోడానికీ వీలు కలుగుతుందని మొబీక్విక్‌ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ ఉపాసనా తాకు పేర్కొన్నారు. ఇది తమకు కీలక వాణిజ్య విభాగంగా మారుతుందన్న అభిప్రాయాన్నీ ఆమె వ్యక్తం చేశారు. ఎంఎంటీసీ-పీఏఎంపీ భాగస్వామ్యంతో గత ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రధాన వాటాలున్న పేటీఎం గత ఏడాది పసిడి విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 



You may be interested

జీఎస్‌కే మొత్తం ఆదాయం రూ.831 కోట్లు

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: గ్లాక్సో స్మిత్‌లైన్‌ (జీఎస్‌కే)ఫార్మాస్యూటికల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.101 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.130 కోట్ల నికర లాభం వచ్చిందని, దాంతో పోలిస్తే తాజా క్వార్టర్లో లాభం 23 శాతం క్షీణించిందని జీఎస్‌కే ఫార్మా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.846 కోట్ల నుంచి రూ.831 కోట్లకు తగ్గింది. నికర లాభం తగ్గడంతో బీఎస్‌ఈలో జీఎస్‌కే ఫార్మా షేర్‌

‍ట్రూజెట్‌తో జెట్‌ ఒప్పందం రద్దు!

Tuesday 23rd October 2018

ముంబై: విమానయాన సంస్థ ట్రూజెట్‌కి కొన్ని ప్రాంతీయ విమానాలను లీజుకిచ్చే ఒప్పంద ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. గడువు తేదీలోగా ఒప్పంద షరతుల్ని అమలు చేయటంలో ట్రూజెట్ విఫలం కావడమే దీనికి కారణమని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్‌... నిధుల సమీకరణ కోసం పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి పలు ప్రాంతీయ రూట్లలో విమాన సర్వీసులు అందిస్తున్న

Most from this category