STOCKS

News


గిఫ్ట్‌ దిగుమతులకు కేంద్రం చెక్‌

Friday 4th January 2019
news_main1546575016.png-23398

  • కస్టమ్స్‌ నిబంధనలకు సవరణ యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ: గిఫ్ట్‌ ఐటమ్స్‌ దిగుమతుల నిబంధనలు దుర్వినియోగం అవుతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. కస్టమ్స్ సుంకాలను ఎగవేసే ఉద్దేశంతో బహుమతుల పేరిట రూ. 5,000 దాకా విలువ చేసే ఐటమ్స్ దిగుమతి చేసుకుంటుండటాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం రూ. 5,000 దాకా ఉన్న మినహాయింపును ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే ఒక వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా నాలుగు కన్సైన్‌మెంట్స్‌ మాత్రమే బహుమతులుగా అనుమతించే విషయమూ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ-కామర్స్‌పై జరిగిన కార్యదర్శుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వివరించాయి. దీనిపై తాము చేసిన సిఫార్సులపై కస్టమ్స్ విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రూ. 5,000 దాకా విలువ చేసే గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతులకు కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్న భారత విదేశీ వాణిజ్య చట్టంలోని నిబంధనలను చైనాకి చెందిన పలు ఈ-కామర్స్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్న పరిశ్రమ వర్గాల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది.



You may be interested

రూ.2000 నోటుకు కళ్లెం

Friday 4th January 2019

మనీ లాండరింగ్‌కి ఉపయోగపడుతోందన్న సందేహాలు చలామణీని క్రమంగా తగ్గించడమే ఆర్‌బీఐ ఉద్దేశం ముద్రణ కనిష్ట స్థాయికి తగ్గినట్లు ఆర్థిక శాఖ వెల్లడి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్‌ బ్యాంక్‌ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీలాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు ఈ పెద్ద నోట్లను దుర్వినియోగం చేస్తున్నట్లు

నెస్లేకు మళ్లీ మ్యాగీ కష్టాలు

Friday 4th January 2019

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి మ్యాగీ నూడుల్స్ వివాదం నెస్లే ఇండియాను ఇంకా వెంటాడుతోంది. మ్యాగీ నూడుల్స్‌కి సంబంధించి కంపెనీ మీద ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం పెట్టిన కేసు విచారణపై స్టేను ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణ యథాప్రకారం కొనసాగనుంది. మ్యాగీ నూడుల్ శాంపిల్స్‌పై మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) నిర్వహించిన పరీక్షల ఫలితాలు దీనికి ప్రాతిపదికగా ఉంటాయని సుప్రీం

Most from this category