News


కోబ్రా కథనం అసత్యం

Thursday 31st January 2019
news_main1548912630.png-23916

  • ఖండించిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌
  • ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విక్రయం !

ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ ఆన్‌లైన్‌​ న్యూస్‌ పోర్టల్‌, కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన వార్త సత్యదూరమని ఆ కంపెనీ ఖండించింది. ఎలాంటి డొల్ల కంపెనీలకు రుణాలివ్వలేదని, పార్టీలకు విరాళాలు ఇచ్చామనడం కూడా అబద్ధమేనని కంపెనీ చైర్మన్‌ కపిల్‌ వాధ్వాన్‌ పేర్కొన్నారు. వికాస్‌ శేఖర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే కోబ్రాపోస్ట్‌ సత్యదూరమైన కథనాన్ని పోస్ట్‌ చేసిందని విమర్శించారు. ఆ వ్యక్తి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పేరు చెప్పి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో గృహాలను అందించే తమ అనుబంధ సం‍స్థ, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు విక్రయానికి సంబంధించిన వివరాలను మరో రెండు రోజుల్లో వెల్లడిస్తామని వివరించారు. అలాగే జీవిత బీమా వెంచర్‌లోని పెట్టుబడులను కూడా విక్రయించాలని యోచిస్తున్నామని తెలిపారు.



You may be interested

ఐసీఐసీఐ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 31st January 2019

క్యు3 ఫలితాలు ఆశావహంగా ఉండడంతో పలు బ్రోకరేజ్‌లు ఐసీఐసీఐ బ్యాంకు షేరుపై పాజిటివ్‌గా మారాయి. క్యు3లో బ్యాంకు ఎన్‌ఐఐ, మార్జిన్లు మంచి వృద్ది నమోదు చేయడంతో పాటు మొండిపద్దుల విషయంలో మంచి మెరుగుదల చూపింది. దీంతో బ్యాంకు ఎన్‌పీఏ సైకిల్‌ టాప్‌అవుట్‌ అయినట్లు నిపుణులు భావిస్తున్నారు.  బ్రోకరేజ్‌ల అంచనాలు - సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 450 నుంచి 470కి పెంచింది. ఎర్నింగ్స్‌లో మెరుగుదల కనిపిస్తోంది. కాసా బలంగా ఉంది. ఫైనాన్స్‌

మరింత పెరిగిన పసిడి

Thursday 31st January 2019

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో కీలక వడ్డీరేట్లపై యథాతధ స్థితిని కొనసాగించే దిశగా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు వెలువరించడంతో గురువారం పసిడి ధర మరింత ఎగిసింది. ఇది 8నెలల గరిష్టస్థాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి 10డాలర్లు ర్యాలీ చేసి 1,320.20 డాలర్ల గరిష్టాన్ని తాకింది. వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ మెతక వైఖరీ కారణంగా డాలర్‌ విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. మరోవైపు

Most from this category