STOCKS

News


విస్తరిస్తున్న మిరాజ్‌ సినిమాస్‌

Friday 29th March 2019
Markets_main1553850710.png-24862

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మల్టీప్లెక్సుల నిర్వహణలో ఉన్న మిరాజ్‌ సినిమాస్‌ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కంపెనీ 110 స్క్రీన్లను నిర్వహిస్తోంది. వచ్చే 15-18 నెలల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్టు మిరాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భువనేష్‌ మెందిరట్ట గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందులో దక్షిణాదినే కొత్తగా 50 స్క్రీన్లు రానున్నాయని చెప్పారు. నూతన ప్రాజెక్టులకుగాను రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించారు. 2018-19లో రూ.200 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.325 కోట్ల టర్నోవర్‌ అంచనా వేస్తున్నట్టు తెలిపారు.



You may be interested

5 బ్యాంకులకు రూ. 21,428 కోట్ల మూలధనం

Friday 29th March 2019

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న రూ. 21,428 కోట్ల అదనపు మూలధనానికి ప్రతిగా ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించేందుకు అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. తమ షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులు పొందాయి. ఆయా బ్యాంకులు గురువారం ఈ విషయం తెలిపాయి. అదనపు మూలధనం అందుకుంటున్న వాటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్

ఏడాదిలో మరో 25 శాతం ర్యాలీ!

Friday 29th March 2019

అర్వింద్‌ శాంగెర్‌ అంచనా ఎకానమీలో జోరు కొనసాగితే వచ్చే 12 నెలల్లో దేశీయ మార్కెట్లు 20- 25 శాతం మేర ర్యాలీ జరుపుతాయని జియోస్ఫియర్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధి అర్వింద్‌ శాంగెర్‌ అంచనా వేశారు. యూఎస్‌, యూరప్‌లో మాంద్యం రాకుండా ఉండి, అంతర్జాతీయ కేంద్రబ్యాంకులు లిక్విడిటీ తగ్గకుండా చర్యలు తీసుకొని, అమెరికా, భారత్‌ల్లో జీడీపీ పరుగులు ఆగకుండా ఉంటే దేశీ మార్కెట్లకు ఎదురుండదన్నారు. పశ్చిమ దేశాల్లో పలు ఎకానమీలతో పోలిసే​‍్త భారత్‌,

Most from this category