STOCKS

News


మైండ్‌ ట్రీ లాభం 65 శాతం అప్‌

Thursday 18th October 2018
news_main1539833746.png-21251

న్యూఢిల్లీ: మధ్య తరహా ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 65 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.125 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.206 కోట్లకు పెరిగిందని మైండ్‌ ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,332 కోట్ల నుంచి 32 శాతం పెరిగి రూ.1,755 కోట్లకు చేరిందని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్‌డీ రోస్టో రావణన్‌ తెలిపారు. . సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 30 శాతం, ఆదాయం 7 శాతం చొప్పున వృద్ధి సాధించాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. 
జోరుగా కంపెనీ వృద్ధి....
డాలర్ల పరంగా చూస్తే, కంపెనీ నికర లాభం 50 శాతం పెరిగి 2.91 కోట్ల డాలర్లకు, ఆదాయం 20 శాతం వృద్ధితో 25 కోట్ల డాలర్లకు పెరిగాయని రావణన్‌ తెలిపారు. డిజిటల్‌, ఇతర విభాగాల్లో అమితమైన నైపుణ్యం కారణంగా కంపెనీ వృద్ధి జోరుగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య 341గా ఉందని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 19,402గా ఉందని పేర్కొన్నారు. వార్షిక ఆట్రీషన్‌ రేటు (ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగులు మారడం) 13 శాతంగా ఉందని వివరించారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో మైండ్‌ట్రీ షేర్‌ 0.6 శాతం నష్టంతో రూ.979 వద్ద ముగిసింది. 



You may be interested

రూపాయి పతనంతో నష్టాలే... నష్టాలు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం- ఎగుమతిదారులకు ప్రయోజనకరమన్న వాదన ఉంది. దిగుమతులు తగ్గుతాయన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే వాస్తవంలో ఇలా జరగాలేదని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అధ్యయనం ఒకటి విశ్లేషించింది. వివరంగా చూస్తే... ♦ ఎగుమతుల కోణంలో...: ఎగుమతిదారులు తమ ఎగుమతుల విలువను డాలర్లలో సంపాదించుకుంటారు. ఈ డాలర్లను దేశంలో మార్చుకుంటే, ఎక్కువ రూపాయలు వారి చేతికి అందుతాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత

ఏసీసీ లాభం రూ.209 కోట్లు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: సిమెంట్‌ కంపెనీ ఏసీసీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడో  త్రైమాసిక కాలంలో 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది  క్యూ3లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది క్యూ3లో రూ.209 కోట్లకు పెరిగిందని ఏసీసీ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,141 కోట్ల​ నుంచి 10 శాతం వృద్ధితో రూ.3,466 కోట్లకు పెరిగిందని ఏసీసీ ఎమ్‌డీ, సీఈఓ నీరజ్‌

Most from this category