News


మైండ్‌ ట్రీ లాభం 35 శాతం అప్‌

Thursday 17th January 2019
news_main1547701729.png-23633

  • 30 శాతం పెరిగిన ఆదాయం
  • ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: మధ్య తరహా ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 35 శాతం  పెరిగింది. గత క్యూ3లో రూ.142 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.191 కోట్లకు పెరిగిందని మైండ్‌ ట్రీ తెలిపింది.ఆదాయం రూ.1,378 కోట్ల నుంచి 30 శాతం ఎగసి రూ.1,787 కోట్లకు చేరిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ రోస్టౌ రావణన్‌ పేర్కొన్నారు. డాలర్ల పరంగా చూస్తే నికర లాభం 22 శాతం వృద్ధితో 2.7 కోట్ల డాలర్లకు, ఆదాయం 17 శాతం వృద్ధితో 25 కోట్ల డాలర్లకు పెరిగాయి. సీజనల్‌గా బలహీనంగా ఉన్న క్యూ3లోనూ మంచి ఫలితాలు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నామని పేర్కొన్నారు. డిజిటల్‌ వ్యాపారం 32 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. గత నెల చివరి నాటికి యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య 340గా ఉందని, ఉద్యోగుల సంఖ్య 19,908గా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల వలస (ఆట్రీషన్‌) 13.4 శాతంగా ఉందని వివరించారు.You may be interested

51 శాతం పెరిగిన డీసీబీ బ్యాంక్‌ లాభం

Thursday 17th January 2019

- మొత్తం ఆదాయం 27 శాతం అప్‌ న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ డీసీబీ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 51 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.57 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లకు ఎగసిందని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు జోరుగా పెరగడంతో ఈ స్థాయి నికర లాభం

విదేశీ వాణిజ్య రుణ విధానాలు సరళతరం

Thursday 17th January 2019

ముంబై: విదేశీ వాణిజ్య రుణ (ఈసీబీ) విధానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం సరళతరం చేసింది. వ్యాపార నిర్వహణా విధానాలను మరింత సరళతరం చేయడంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.  దీని ప్రకారం- - రుణం పొందడానికి అర్హత కలిగిన అన్ని సంస్థలూ ఒక ఆర్థిక సంవత్సరంలో 750 మిలియన్‌ డాలర్ల వరకూ (లేదా అంతకుసమానమైన విదేశీ మొత్తం) విదేశీ రుణాన్ని ఆటోమేటిక్‌ రూట్‌లో (ముందస్తు

Most from this category