STOCKS

News


మైండ్‌ట్రీ ప్రత్యేక సంస్థగానే కొనసాగుతుంది

Tuesday 9th July 2019
news_main1562652999.png-26921

  • ఎల్‌అండ్‌టీ సీఈవో సుబ్రహ్మణ్యన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటికీ దాన్ని విడిగానే కొనసాగించనున్నట్లు ఇన్‌ఫ్రా దిగ్గజం ఎల్‌అండ్‌టీ సీఈవో ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ తెలిపారు. గ్రూప్‌లో భాగమైన ఐటీ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ కార్యకలాపాలు వేర్వేరుగానే ఉన్నాయని ఆయన వివరించారు. మైండ్‌ట్రీ సిబ్బంది విషయంలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చేసే యోచనేదీ లేదని ఆయన చెప్పారు. కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగుతాయని, రాబోయే రోజుల్లో కొత్త సీఈవోను ప్రకటించవచ్చని సుబ్రహ్మణ్యన్ తెలిపారు. "ఎల్‌టీఐ, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్‌టీటీఎస్‌)కు సంబంధం లేకుండా మైండ్‌ట్రీని ప్రత్యేక సంస్థగానే కొనసాగిస్తాం. భవిష్యత్‌ పరిణామాల గురించి ఇప్పుడే ఊహాగానాలు చేయడం సరికాదు" అని ఆయన పేర్కొన్నారు. బలవంతపు టేకోవర్‌లో భాగంగా మైండ్‌ట్రీలో 60.06 శాతం వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ఎల్‌అండ్‌టీ ప్రమోటరుగా మారిన సంగతి తెలిసిందే. ఈ టేకోవర్‌ను వ్యతిరేకిస్తూ మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులు కృష్ణకుమార్ నటరాజన్ (చైర్మన్), రోస్టో రవనన్‌ (సీఈవో) పార్థసారథి ఎన్‌ఎస్‌ (వైస్‌ చైర్మన్‌) కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.



You may be interested

ప్రస్తు‍త పరిస్థితిని కొనుగోలుకు వాడుకోండి: సంజివ్‌ భాసిన్‌

Tuesday 9th July 2019

‘బడ్జెట్‌ను అర్థం చేసుకోడానికి మార్కెట్లకు ఇంకో వారం రోజులు పడుతుంది. ఈ సమయాన్ని కొనుగోలుకు వినియోగించుకోవాలి’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్యూకుటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజివ్‌ భాసిన్‌  ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే...   మార్కెట్లు అతిగా స్పందించాయి.. పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ కనీస పరిమితిని బడ్జెట్‌లో 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడంతో స్టాక్‌ మార్కెట్‌లో షేర్‌ సప్లై పెరగనుండడంతో

వచ్చే నెలలో మొబైల్ ట్రాకింగ్‌ వ్యవస్థ

Tuesday 9th July 2019

న్యూఢిల్లీ: దొంగతనానికి గురైన లేదా పోయిన మొబైల్ ఫోన్స్‌ ఆనవాళ్లు పట్టుకునేందుకు ఉపయోగపడే ట్రాకింగ్ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ యోచిస్తోంది. మొబైల్ ఫోన్ నుంచి సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చేసినా కూడా ట్రాకింగ్ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. సెంటర్‌ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమాటిక్స్‌ (సీ-డాట్‌) ఇప్పటికే ఈ టెక్నాలజీని సిద్ధం చేసిందని, ఆగస్టు నుంచి

Most from this category