STOCKS

News


మైక్రోసాఫ్ట్ @ 1 లక్ష కోట్ల డాలర్లు

Friday 26th April 2019
news_main1556257155.png-25364

న్యూయార్క్‌:  టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్‌క్యాప్ పరంగా తొలిసారి 1 లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది. టెక్నాలజీ రంగానికి చెందిన అమెజాన్‌, యాపిల్‌ తర్వాత ఈ స్థాయిని చేరిన మూడో కంపెనీ మైక్రోసాఫ్ట్‌. అంచనాలు మించిన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు దాదాపు అయిదు శాతం ర్యాలీ చేసి 130.59 డాలర్లకు చేరడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్‌ 1 లక్ష కోట్ల డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో యాపిల్‌, అమెజాన్‌ కన్నా ముందు నిలవడం గమనార్హం. గతేడాదే 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని దాటిన ఈ రెండు సంస్థలు ప్రస్తుతం కొంత క్షీణించాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్ విభాగం ఊతంతో మార్చి త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ లాభం 19 శాతం వృద్ధితో 8.8 బిలియన్ డాలర్లకు ఎగియగా, ఆదాయం 14 శాతం పెరిగి 30.8 బిలియన్ డాలర్లకు చేరింది.



You may be interested

ఎమ్‌సీఎక్స్‌ లాభం 78 శాతం అప్‌

Friday 26th April 2019

-సగటు రోజువారీ టర్నోవర్‌లో రికార్డ్‌ -రూ.111 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: కమోడిటీ ఎక్స్చేంజ్‌ దిగ్గజం, ఎమ్‌సీఎక్స్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో 78 శాతం ఎగసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో రూ.34 కోట్లుగా ఉన్న నికర లాభం 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.61 కోట్లకు పెరిగిందని ఎమ్‌సీఎక్స్‌ తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ

20 శాతం పెరిగిన ఎస్‌బీఐ లైఫ్‌ లాభం

Friday 26th April 2019

మార్చి క్వార్టర్లో రూ.458 కోట్లు న్యూఢిల్లీ: ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాభం మార్చి త్రైమాసికంలో 20 శాతం వృద్ధి సాధించింది. రూ.457 కోట్లకు పైగా లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. ఆదాయం సైతం 50 శాతానికి పైగా పెరిగి రూ.15,601 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.381 కోట్లు, ఆదాయం రూ.10,052 కోట్లుగా ఉన్నాయి. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ

Most from this category