STOCKS

News


పల్లె వాసులకు మైక్రోఫైనాన్స్‌ ‘డిజిటల్‌ టచ్‌’

Saturday 15th December 2018
news_main1544815081.png-22943

దేశంలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఆధునికత వైపు అడుగులు వేస్తూ, అదే సమయంలో పల్లెవాసులకు మరింత సన్నిహితం అవుతున్నాయి. వారితో స్నేహపూర్వకంగా మసలుకుంటున్నాయి. ఈ వివరాలను కేపీఎంజీ ఇండియా మైక్రో ఫైనాన్స్‌ రంగంపై విడుదల చేసిన తాజా నివేదికలో తెలియజేసింది. కోల్‌కతాలో జరిగిన 4వ ఈశాన్య భారత మైక్రోఫైనాన్స్‌ సదస్సు 2018 ఇందుకు వేదికైంది. ఆర్థిక సేవలు అందే విషయంలో చివరి మెట్టులో ఉండే సామాన్యులకు చిన్న రుణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాల ఉన్నతికి మైక్రోఫైనాన్స్‌ సంస్థలు కృషి చేస్తుంటాయని తెలిసిందే. దేశంలో మైక్రోఫైనాన్స్‌ సంస్థల ప్రస్తుత స్థాయి, ఈ రంగంలో టెక్నాలజీ ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తోంది అన్నది ఈ నివేదిక వివరంగా తెలియజేసింది. 

 

రుణాల పంపిణీ, చెల్లింపులు నగదు రహిత విధానానికి మళ్లుతుండడం ఇందులో ప్రధాన అంశం. మొబైల్‌, ట్యాబ్‌ ప్లాట్‌ఫామ్‌ల్లోకి సంస్థలు మార్పు చెందుతున్నాయి. మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌), డేటా అనలైటిక్స్‌ వంటి టెక్నాలజీలతో తమ అంతర్గత, నిర్వహణ సామర్థ్యాలను మెరుగు పరచుకుంటున్నాయి. ఇన్ని జరుగుతున్నా కానీ, అవి తమ కస్టమర్లతో స్నేహపూర్వకంగా, సన్నిహితంగానే మసలుకుంటుండడం గమనార్హం. అయితే, మరింత అభివృద్ధి చెందేందుకు నియంత్రణ పరమైన సమానత్వాన్ని ఇవి ఆశిస్తున్నాయి. ఈ నివేదికలో పేర్కొన్న ప్రధాన అంశాలను చూస్తే...

 

తదుపరి దశ వృద్ధి ఎంతో... సవాళ్లు కూడా

  • మైక్రోఫైనాన్స్‌ సంస్థల రుణ పంపిణీ ఏటేటా వేగంగా పెరుగుతోంది. గత మూడు సంవత్సరాలుగా చూసుకుంటే వార్షికంగా కాంపౌండెడ్‌గా 50 శాతం చొప్పున వృద్ధి నెలకొంది. 
  • భౌగోళికంగా కొత్త ప్రాంతాలకు విస్తరించడం, ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో పెంచుకోవడం, బీమా వంటి ఇతర ఉత్పత్తులను కూడా విక్రయించడం తదితర చర్యల ద్వారా వృద్ధి అవకాశాల అన్వేషణలో పడ్డాయి. 
  • తదుపరి దశ వృద్ధికి అనుగుణంగా సంస్థలు సర్దుబాటు చేసుకోవడం, అవసరమైనంత నిధులను సమీకరించడం అనేవి వాటి ముందున్న సవాళ్లు.
  • బీమా, మ్యూచువల్‌ ఫండ్స్‌ను తక్కువ ఖర్చుకే ఇవి అందించగలవు.   
  • స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులతో పోల్చి చూస్తే రుణాల పంపిణీ విషయంలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలపై నియంత్రణలు ఉన్నాయి. తమను కూడా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల మాదిరే చూడాలన్నది వీటి డిమాండ్‌. 
  • గత కొన్ని త్రైమాసికాలుగా బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణ సవాళ్లను ఇవి ఎదుర్కొంటున్నాయి.  
  • మైక్రోఫైనాన్స్‌ సంస్థల మధ్య డేటాను పారదర్శకంగా ఇచ్చిపుచ్చుకోవడం అన్నది అవసరం. దీనివల్ల రిస్క్‌లను పరిమితం చేయవచ్చు. You may be interested

రేట్ల కోతకు అవకాశం: కోటక్‌ ఈక్విటీస్‌

Saturday 15th December 2018

సానుకూల స్థూల ఆర్థిక డేటా కారణంగా సమీప భవిష్యత్తులో కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించేందుకు అవకాశం ఉందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. నవంబర్‌లో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.3 శాతంగా నమోదు కావడంతో, రానున్న ఫిబ్రవరి భేటీలో ఆర్‌బీఐ ఎంపీసీ తన విధానాన్ని సడలించొచ్చని కోటక్‌ అంచనా వేసింది. ‘‘ఆర్‌బీఐ రేట్లను తగ్గించే ముందు తన విధానాన్ని తటస్థానికి మార్చొచ్చు. ద్రవ్యోల్బణం తాజాగా మరింత తగ్గడం అన్నది ఫిబ్రవరి

ఎన్‌బీఎఫ్‌సీల్లోకి పెరిగిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు

Friday 14th December 2018

దేశీయ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై విదేశీ మదుపరులకు మక్కువ పెరిగింది. ఈ షేర్లలోకి గత ఎనిమిదినెలల తర్వాత తొలిసారి ఎఫ్‌పీఐ నిధులు ప్రవహించాయి. రెండు నెలల అమ్మకాల అనంతరం ఇటీవలే ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు ఆరంభించిన సంగతి తెలిసిందే. గత నెల ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ఎఫ్‌పీఐలు 35.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. లిక్విడిటీ పెంచేందుకు ఆర్‌బీఐ సుముఖత వ్యక్తం చేయడంతో ఎన్‌బీఎఫ్‌సీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ రంగంలోని

Most from this category