STOCKS

News


నిధుల వేటలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు

Saturday 15th December 2018
news_main1544854711.png-22961

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ సంక్షోభ నేపథ్యంలో ద్రవ్య లభ్యత కొరతతో కొట్టుమిట్టాడిన మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఇప్పుడు ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టిని సారించాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ఆగస్ట్‌27న రూ.9వేల భారీ కుంభకోణం వెలుగు చూడటంతో గత 2-3 నెలలుగా మైక్రోఫైనాన్స్‌ తీవ్ర ద్రవ్య లభ్యత కొరతను ఎదుర్కోన్నాయి. ద్రవ్యలభ్యత కొరత సంక్షోభ సుడిగుండం నుంచి గట్టేందుకు మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ప్రత్యమ్నాయ మార్గమైన నిధుల సమీకరణకు మార్కెట్‌ బాట పట్టాయి.

ఇప్పటికే ఢిల్లీకి చెందిన  మైక్రోఫైనాన్స్‌ కంపెనీ సాతిన్‌ క్రెడిట్‌కేర్‌ నెట్‌వర్క్‌ కంపెనీ 30మిలియన్‌ డాలర్లను సమీకరించింది. నెదర్లాండ్‌ డెవెలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీకి నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను విక్రయించి ఈ మొత్తం నిధులను సమీకరించినట్లు కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు, వివిధ రంగాల్లో కంపెనీ పెట్టుబడులకు, తన ఫోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకునేందుకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. సెప్టెంబర్‌ చివరి నాటికి సాతిన్‌ క్రిడెట్‌కేర్‌ స్థూల రుణ పోర్ట్‌ఫోలియో రూ.5,561 కోట్లుగానూ, మొత్తం రూ.6,191 కోట్ల నిర్వహణ ఆస్తులను కలిగి ఉంది.

అలాగే కలకత్తాకి చెందిన విలేజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ కంపెనీ సైతం రూ.50-70 కోట్ల నిధుల సమీకరణకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. స్థానిక ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తం నిధుల సమీకరించాలని కంపెనీ యోచిస్తుంది. ‘‘మైక్రోఫైనాన్స్‌ రంగం ద్రవ్యత్వ సంక్షోభం నుంచి నెమ్మదిగా కోలుకుంటుంది. జనవరి చివరి నాటికి నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం.’’ అని విలేజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ కంపెనీ మేనిజింగ్‌ డైరెక్టర్‌ కుల్దీప్‌ అభిప్రాయపడ్డారు.



You may be interested

విప్రో ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 15th December 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఇకపోతే టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో ఏడీఆర్‌లన్నీ తగ్గాయి. విప్రో ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పడిపోయింది.   టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.43 శాతం తగ్గుదలతో 11.53 డాలర్లకు క్షీణించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అధిక

పెరిగిన ఎగుమతులు

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులు నవంబర్‌లో 26.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదేకాలంతో పోల్చితే 0.80 శాతం వృద్ధి చెందాయి. ఇందుకు బేస్‌ఎఫెక్ట్‌ ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు దిగుమతులు 4.31 శాతం పెరిగి 43.17  బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం ద్వారా వెల్లడైంది. 2016 డిసెంబర్‌ తరువాత దిగుమతులు ఈస్థాయిలో తగ్గడం ఇదే ప్రథమం కాగా.. బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు కారణంగా

Most from this category