STOCKS

News


మెర్సెడెస్‌ బెంజ్‌ నుంచి ‘వీ క్లాస్‌’

Friday 25th January 2019
news_main1548395825.png-23796

ముంబై: దేశ లగ్జరీ కార్ల మార్కెట్‌లో 40 శాతం వాటాతో అగ్రగామి సంస్థగా ఉన్న జర్మనీ కార్ల కంపెనీ మెర్సెడెస్‌ బెంజ్‌ బహుళ వినియోగ వాహన విభాగంలోకి (ఎంపీవీ) తిరిగి అడుగుపెట్టింది. కొత్తగా వీ-క్లాస్‌ శ్రేణిలో 6 సీట్ల ఎక్స్‌క్లూజివ్‌, 7 సీట్ల ఎక్స్‌ప్రెషన్‌ పేరుతో రెండు కార్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 90కి పైగా దేశాల్లో ఈ సంస్థ వీ క్లాస్‌ శ్రేణి కార్లను విక్రయిస్తోంది. స్పానిష్‌ ప్లాంట్‌ నుంచి వీటిని దేశంలోకి దిగుమతి చేసుకుంటామని ప్రకటించింది. 2.2 లీటర్ల డీజిల్‌ ఇంజన్లతో కూడిన వీటి ధరలు రూ.68.40-81.90 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ఏడాది 10 నూతన మోడళ్ల విడుదల ప్రణాళికలతో ఉన్న ఈ సంస్థ నుంచి తొలి విడుదల వీ క్లాస్‌ కావడం గమనార్హం. ఈ ఏడాది మరో 20 పట్టణాలకు విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. మెర్సెడెస్‌ బెంజ్‌ ఆర్‌ క్లాస్‌ పేరుతో గతంలో ఎంపీవీ విభాగంలో కార్లను ప్రవేశపెట్టగా, తగిన అమ్మకాలు లేకపోవడంతో తప్పుకుంది. 2018లో 15,538 వాహనాలను విక్రయించి వరుసగా నాలుగో ఏడాది లగ్జరీ కార్ల విభాగంలో ఈ సంస్థ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.



You may be interested

ఈ - కామ​ర్స్‌ రంగంపై అంతర్జాతీయ ఒప్పందం

Friday 25th January 2019

- పిలుపునిచ్చిన డబ్ల్యూటీఓ చీఫ్‌ - మరింత క్లిష్టంగా వాణిజ్య సవాళ్లు: ఐరాస - కృత్రిమ మేధపై నియంత్రణ: సత్య నాదెళ్ల దావోస్‌: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్‌ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి అంతర్జాతీయ

అన్ని ఫండ్లకూ పన్ను లాభాలుండాలి

Friday 25th January 2019

- డెట్‌ ఫండ్స్‌కూ సెక్షన్‌ 80సీ అర్హత కల్పించాలి - ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌కు ఈక్విటీ హోదా ఇవ్వాలి - ఫండ్‌ పథకాలకూ క్యాపిటల్‌ గెయిన్స్‌ ప్లాన్లు - దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై పునరాలోచన - ‘బడ్జెట్‌’పై ప్రభుత్వానికి యాంఫీ వినతులు (న్యూఢిల్లీ) మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మరింత పెద్ద మొత్తంలో వచ్చే దిశగా చేపట్టాల్సిన చర్యలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ ‘యాంఫి’ కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. ఇవన్నీ దాదాపుగా గతేడాది పంపిన ప్రతిపాదనలేనని,

Most from this category