News


నేను ఏ తప్పూ చేయలేదు

Wednesday 12th September 2018
news_main1536731043.png-20195

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అక్రమంగా తన ఆస్తులను అటాచ్‌ చేసిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) భారీ రుణ కుంభకోణ నిందితుడు మేహుల్‌ చోక్సీ ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన వెల్లడించారు. ఆంటిగ్వా నుంచి పంపిన తొలి వీడియో మేసేజ్‌లో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన రూ.13,500 కోట్ల రుణ కుంభకోణంలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరిగా అనుమానిస్తున్న మేహుల్‌ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చోక్సీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంలో...ఎలాంటి వివరణ లేకుండానే తన పాస్‌పోర్ట్‌ను సస్పెండ్‌ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈడీ తనకు వ్యతిరేకంగా  చేసిన ఆరోపణలన్నీ తప్పు అని, నిరాధారమైనవని  ఆయన వివరించారు. తన ఆస్తులను అక్రమంగా అటాచ్‌ చేశారని ఆరోపించారు. భారత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో తన పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తున్నట్లు పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌ నుంచి తనకొక ఈ మెయిల్‌ వచ్చిందని వివరించారు. తన  పాస్‌పోర్ట్‌పై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాల్సిందని కోరుతూ ముంబై ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి ఒక మెయిల్‌ పంపానని, దానికి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. 

రూ. 3,250 కోట్ల నిధులు మళ్లించారు: ఈడీ చార్జిషీటు
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన నిధుల్లో దాదాపు రూ. 3,250 కోట్లను మెహుల్ చోక్సీ.. థాయ్‌లాండ్‌, అమెరికా తదితర విదేశాలకు మళ్లించారని ఆయనపై దాఖలు చేసిన చార్జిషీటులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. అనేక డొల్ల కంపెనీల ద్వారా వ్యక్తిగత అవసరాల కోసం ఆయన ఈ నిధులను మళ్లించినట్లు ఆరోపించింది. రుణంగా తీసుకున్న మొత్తంలో 56.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 400 కోట్లు) నీరవ్ మోదీకి, మరో 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 360 కోట్లు) మోదీ తండ్రి దీపక్‌ మోదీకి చోక్సీ మళ్లించారని ఈడీ పేర్కొంది. చోక్సీ తన సంస్థ షోరూమ్‌లలో నాసిరకం వజ్రాలు, ఆభరణాల రేట్లను భారీగా పెంచేసి విక్రయించేవారని పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణలో గీతాంజలి గ్రూప్ (చోక్సీ సంస్థ) వైస్ ప్రెసిడెంట్ విపుల్ చితాలియా వెల్లడించిన వివరాలు ఇందుకు ఊతమిస్తున్నాయని తెలిపింది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు కూడా నిఖార్సయినవి కావని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. You may be interested

రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.272 కోట్లు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.272 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ. 378 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.4,444 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,641 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) రూ.11.70గా

రాష్ట్రాలకు పెట్రో ధరలు తగ్గించే వెసులుబాటు!

Wednesday 12th September 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలూ తీవ్రంగా ఉన్నాయి. దీనితో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆయా అంశాలు రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ మొత్తంలో రూ.22,700 కోట్ల ‘వ్యాట్‌’ (వీఏటీ) ఆదాయాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ధర సగటున 75 డాలర్లు,

Most from this category