News


రెండేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయం

Thursday 22nd November 2018
news_main1542864642.png-22297

ముంబై: ఆన్‌లైన్‌ ఫార్మసీ రిటైల్‌ సంస్థ, మెడ్‌లైఫ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.830 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల ఆదాయం వచ్చిందని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తుషార్‌ కుమార్‌ పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో  ఈ-ఫార్మసీ వ్యాపారం వాటా 80 శాతంగా ఉందని, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 65-70 శాతానికి తగ్గుతుందన్న అంచనాలున్నాయని చెప్పారు.
రెండేళ్లలో రూ.700 కోట్ల పెట్టుబడులు...
రానున్న రెండేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుషార్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఫార్మసీలను మరింతగా విస్తరిస్తామని, డయాగ్నస్టిక్స్‌ డివిజన్‌ జోరు పెంచుతామని వివరించారు. 2014 నుంచి ప్రారంభమైన తమ కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో లాభాల్లోకి వస్తుందన్నారు. ఇప్పటిదాకా రూ.300 కోట్లు ఇన్వెస్ట్‌ చేశామని, వచ్చే రెండేళ్లలో రూ.700 కోట్ల వరకూ ఇన్వెస్ట్‌ చేయనున్నామని చెప్పారు. You may be interested

సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ఇండియా హెడ్‌గా సుమర్‌ జునేజా

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: జపాన్‌ దిగ్గజ సంస్థ, సాఫ్ట్‌బ్యాంక్‌ తన విజన్‌ ఫండ్‌ భారత అధినేతగా సమర్‌ జునేజాను నియమించింది.  భారత్‌లో విజన్‌ ఫండ్‌ కార్యకలాపాలను జునేజా నిర్వహిస్తారని సాఫ్ట్‌బ్యాంక్‌ వెల్లడించింది. సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ద్వారా వివిధ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఈ ఫండ్‌ ఇప్పటికే భారత్‌కు చెందిన నాలుగు పెద్ద స్టార్టప్‌ల్లో 500 కోట్ల డాలర్ల వరకూ ఇన్వెస్ట్‌ చేసింది. ఓయో, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎమ్‌,

భారత్‌లో 15వేల ఉద్యోగాలు!!

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన ఫర్నిచర్ తయారీ దిగ్గజం ఐకియా... భారత్‌లో తమ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను దాదాపు పది రెట్లు పెంచుకుని.. సుమారు 15,000 స్థాయికి చేర్చనున్నట్లు ఐకియా బుధవారం తెలిపింది. అదే సమయంలో కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అంతర్జాతీయంగా 7,500 ఉద్యోగాలను కుదించనున్నట్లు వెల్లడించింది. ‘‘భారత మార్కెట్లో 1.5 బిలియన్ యూరోల మేర పెట్టుబడులు పెడుతున్నాం.

Most from this category