STOCKS

News


ఎమ్‌సీఎక్స్‌ లాభం 78 శాతం అప్‌

Friday 26th April 2019
news_main1556257317.png-25365

-సగటు రోజువారీ టర్నోవర్‌లో రికార్డ్‌
-రూ.111 కోట్లకు పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: కమోడిటీ ఎక్స్చేంజ్‌ దిగ్గజం, ఎమ్‌సీఎక్స్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో 78 శాతం ఎగసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో రూ.34 కోట్లుగా ఉన్న నికర లాభం 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.61 కోట్లకు పెరిగిందని ఎమ్‌సీఎక్స్‌ తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ మృగాంక్‌ పరాంజపే తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.97 కోట్ల నుంచి రూ.111 కోట్లకు పెరిగిందని, . వ్యయాలు రూ.51 కోట్ల నుంచి రూ.58 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.  

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.108 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఎగసి రూ.146 కోట్లకు పెరిగిందని మృగాంక్‌ పరాంజపే తెలిపారు.  
రోజువారీ టర్నోవర్‌ 21 శాతం అప్‌....
గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్‌ స్థాయి మార్కెట్‌వాటా (92 శాతం) సాధించామని  పరాంజపే తెలిపారు. సగటు రోజువారీ టర్నోవర్‌ 21 శాతం వృద్ది చెందిందని పేర్కొన్నారు. గత క్యూ4లో రూ.26,981 కోట్ల రోజువారీ సగటు టర్నోవర్‌ సాధించామని, 2013, జూలై తర్వాత ఇదే అత్యధికమని వివరించారు.You may be interested

రుణగ్రహీతలకు అదనంగా 60 రోజుల గడువు

Friday 26th April 2019

ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులపై ఆర్‌బీఐ యోచన న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తుల పరిష్కారానికి సంబంధించి మార్గదర్శకాలను ఆర్‌బీఐ సవరించనుంది. రుణ చెల్లింపులకు అదనంగా 60 రోజుల గడువు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. తద్వారా నిజాయితీగా నడిచే వ్యాపార సంస్థలకు ఇబ్బందులు రాకుండా చూడొచ్చని భావిస్తోంది. రుణ వాయిదాల చెల్లింపుల్లో ఒక్క రోజు విఫలమైన సరే వాటిని నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏలు) పరిగణించాలన్న ఆర్‌బీఐ 2018 ఫిబ్రవరి 12

మైక్రోసాఫ్ట్ @ 1 లక్ష కోట్ల డాలర్లు

Friday 26th April 2019

న్యూయార్క్‌:  టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్‌క్యాప్ పరంగా తొలిసారి 1 లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది. టెక్నాలజీ రంగానికి చెందిన అమెజాన్‌, యాపిల్‌ తర్వాత ఈ స్థాయిని చేరిన మూడో కంపెనీ మైక్రోసాఫ్ట్‌. అంచనాలు మించిన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు దాదాపు అయిదు శాతం ర్యాలీ చేసి 130.59 డాలర్లకు చేరడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్‌ 1 లక్ష కోట్ల డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత

Most from this category