STOCKS

News


నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల లక్ష్యం!

Friday 13th July 2018
news_main1531503557.png-18302

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోల్‌కతాకు చెందిన మహిళల పర్‌ఫ్యూమ్‌ బ్రాండ్‌ మెకెన్రో వచ్చే నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యించింది. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.408 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఈ ఏడాది రూ.500 కోట్లను లక్ష్యించామని కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ (సీబీవో) సంజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. శుక్రవారమిక్కడ మార్కెట్లోకి ‘సీక్రెట్‌ టెంప్టేషన్‌’లో రొమాన్స్, మిస్టరీ, అఫైర్, ప్లే, ఫ్యాషన్‌ కొత్త పరిమళాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డియో మార్కెట్లో మెకెన్రో రెండో స్థానంలో ఉందని.. దక్షిణాదిలో 6.3 శాతం మార్కెట్‌ వాటా తమకుందని తెలిపారు. సీక్రెట్‌ టెంప్టేషన్‌ డియో బ్రాండ్‌కు హైదరాబాద్‌లో 3.9 శాతం మార్కెట్‌ వాటా ఉందన్నారు. మెకెన్రో నుంచి సీక్రెట్‌ టెంప్టేషన్‌తో పాటూ వైల్డ్‌ స్టోన్, హెవెన్స్‌ గార్డెన్‌ బ్రాండ్లు కూడా ఉన్నాయి.
రూ.100 కోట్లతో రెండో ప్లాంట్‌..
మెకెన్రో డియోడరెంట్, పర్‌ఫ్యూమ్స్, టాల్కమ్‌ పౌడర్స్, వెట్‌ Ððవెప్స్, సబ్బుల్ని విక్రయిస్తోంది. ‘‘ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో తయారీ యూనిట్‌ ఉంది. ఇక్కడ టాల్కమ్‌ పౌడర్, సబ్బులను మాత్రమే తయారు చేస్తాం. మా డియో, పర్‌ఫ్యూమ్‌ ఉత్పత్తులన్నీ థర్డ్‌ పార్టీ నుంచి సోర్సింగ్‌ చేస్తున్నాం. త్వరలోనే రూ.100 కోట్ల పెట్టుబడులతో ఉత్తరాఖండ్‌లో రెండో తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నాం. దీన్ని ఎగుమతులకు వినియోగిస్తాం. ప్రస్తుతం బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మా మొత్తం మార్కెట్‌లో ఎగుమతుల వాటా 4 శాతం. ప్రస్తుతం మన దేశంలో 1,200 మంది డిస్ట్రిబ్యూటర్లు, 70 వేల రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ఉన్నాయి’’ అని సంజయ్‌ వివరించారు. దేశంలో డియోడరెంట్‌ మార్కెట్‌ రూ.2,500 కోట్లని, దీన్లో మగవారి డియో వాటా 72 శాతం కాగా మిగిలింది మహిళళదన్నారు.

 



You may be interested

డీసీఐని ప్రైవేటీకరించం

Friday 13th July 2018

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను (డీసీఐ) ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయానశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. డీసీఐ నిర్వహణ బాధ్యతలను విశాఖపట్నం, పారదీప్, న్యూమంగుళూరు పోర్టులకు అప్పగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశంలోని మేజర్‌ పోర్టుల చైర్మన్లతో రెండురోజుల సమీక్షా సమావేశం విశాఖలో జరిగింది. సమావేశానంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ, ఆక్వా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను మరింత

ఖరీదైన ఆభరణాలు కొన్న వారి రిటర్నులు మళ్లీ మదింపు

Friday 13th July 2018

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సంస్థల నుంచి ఖరీదైన ఆభరణాలు కొన్న 50 మందికి పైగా అధిక విలువ కలిగిన వ్యక్తుల రిటర్నులను... మరోసారి తిరిగి మదింపు చేయాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. పీఎన్‌బీని రూ.13,000 కోట్లకు మోసగించి నీరవ్‌ మోదీ విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఉన్న ఆదాయ మార్గాలను తెలియజేయాలని నోటీసులు పంపినా గానీ... చాలా మంది

Most from this category