STOCKS

News


పీర్‌లెస్‌ నుంచి రూ.1,514 కోట్లు వసూళ్లు!

Wednesday 24th April 2019
news_main1556080406.png-25312

- ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌
ప్రొటెక‌్షన్‌ ఫండ్‌కు బదలాయింపులు
- ఇన్వెస్టర్ల ప్రయోజనాల 
పరిరక్షణలో కీలక పరిణామం

న్యూఢిల్లీ: పీర్‌లెస్‌ జనరల్ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఇన్వెస్టర్లకు బకాయిపడిన రూ.1,514 కోట్లు రాబట్టుకోవడంలో ఎట్టకేలకు ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటక‌్షన్‌ ఫండ్‌ (ఐఈపీఎఫ్‌) సఫలీకృతమైంది. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీ ఎట్టకేలకు తన వద్ద 15 సంవత్సరాలకుపైగా పెండింగ్‌లో ఉండిపోయిన ‘అన్‌ పెయిడ్‌ డిపాజిట్లను (చెల్లించని డిపాజిట్లు) ఐఈపీఎఫ్‌కు బదలాయించినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణలో ఇది కీలక అంశమని ప్రకటన వివరించింది.   ప్రకటన ప్రకారం.. 
- పీర్‌లెస్ సంస్థ 1.49 కోట్ల డిపాజిట్ సర్టిఫికెట్ల ద్వారా ఈ నిధులను సమీకరించింది. 
- ఇందులో 50.77 శాతం నిధుల సమీకరణ.. రూ. 2,000 లేదా అంతకన్నా తక్కువ విలువ చేసే డిపాజిట్ సర్టిఫికెట్స్ ద్వారా జరిగింది.
-  ఇన్వెస్టర్లలో 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారు ఉన్నారని, అత్యధిక సంఖ్యలో ఇన్వెస్టర్లు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారని కేంద్రం పేర్కొంది. 
- 2013 కంపెనీల చట్టం ప్రకారం ఐఈపీఎఫ్‌ ఏర్పాటయ్యింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఈ ఫండ్‌ ఏర్పాటు లక్ష్యం. 
- కాగా తాజాగా పీర్‌లెస్‌ జరిపిన బదలాయింపుల్లో వడ్డీ మొత్తాలు కలిసిలేవని అధికార వర్గాలు తెలిపాయి. వడ్డీతో కలుపుకుంటే మాత్రం చెల్లించాల్సిన మొత్తం రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
- పలు కంపెనీలు గడచిన ఏడేళ్ల కాలంలో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు, షేర్లను ఐఈపీఎఫ్‌ అకౌంట్‌కు బదలాయించాయి. ఐఈపీఎఫ్‌కు మూలధనం రూ.4,138 కోట్లుగా ఉంది. రూ.21,232 కోట్ల విలువైన షేర్లను నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు బదలాయించాయి.
- తమకు పలు సంస్థలు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని ఇన్వెస్టర్ల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోడానికి ఐఈపీఎఫ్‌ అథారిటీ ఆన్‌లైన్‌ సౌలభ్యం కూడా కల్పిస్తోంది. ఇలాంటి ఆరోపణలకు సంబంధించి ఐఈపీఎఫ్‌ పలు కంపెనీలకు 4,000 నోటీసులను కూడా జారీ చేసింది. - - మెచ్యూరిటీ తీరినా, పలు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తమ డిపాజిట్లను తిరిగి చెల్లించడంలేదని ఇన్వెస్టర్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. 



You may be interested

మార్కెట్లోకి రెక్కలు లేని సీలింగ్‌ ఫ్యాన్లు

Wednesday 24th April 2019

హైదరాబాద్‌: సాధార‌ణ సీలింగ్ ఫ్యాన్లకు భిన్నంగా రెక్కలు లేని అధునాతన ఫ్యాన్లు తెలుగురాష్ట్రాల్లోకి అడుగుపెట్టాయి. ఎక్స్ హీల్  కంపెనీ రూపొందించిన ఈ నూతనతరం ఉత్పత్తులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డొమెక్ సొల్యూషన్స్ పరిచయంచేసింది. శుద్దిచేసిన గాలిని ఏమాత్రం శబ్ధంలేకుండా 360 డీగ్రీల్లో అందిచడమే కాకుండా, ఏసీని ఆపినప్పటికీ ఉష్ణోగ్రతను ఈ ఫ్యాన్లు 8 గంట‌ల వ‌ర‌కు నిర్వహించగలవని వివరించింది. ఎల్‌ఈడీ లైట్లు లేని ఫ్యాను ధర రూ.23,500 కాగా, ఎల్‌ఈడీ

ఏడాదిలో ఐపీఓకి!

Wednesday 24th April 2019

- సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ భాస్కర్‌ బాబు - తెలుగు రాష్ట్రాల్లో తొలి బ్రాంచ్‌ ఆరంభం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఆర్‌.భాస్కర్‌ బాబు చెప్పారు. ఐపీఓ ద్వారా 450- 500 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి రూ.248 కోట్లు సమీకరించామని, ప్రస్తుతం బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్‌,

Most from this category