STOCKS

News


మాక్స్‌బుపాలో వాటా విక్రయించిన మ్యాక్స్‌ ఇండియా

Wednesday 27th February 2019
news_main1551241089.png-24349

  • డీల్‌ విలువ రూ.510 కోట్లు 

న్యూఢిల్లీ: మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను మ్యాక్స్‌ ఇండియా విక్రయించింది. ఈ వాటాను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, ​ ట్రూ నార్త్‌ ఫండ్‌ ఫోర్‌ ఎల్‌ఎల్‌పీకి విక్రయించామని మ్యాక్స్‌ ఇండియా తెలిపింది. ఈ డీల్‌  విలువ రూ.510 కోట్లని పేర్కొంది.  మొత్తం నగదులోనే ఈ లావాదేవీ జరిగింది. ఈ లావేదేవీ పరంగా చూస్తే, మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విలువ రూ.1,001 కోట్లుగా ఉంది. 

రెండేళ్లలో కొత్త బ్రాండ్‌...
ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత మాక్స్‌ బుపా డైరెక్టర్ల బోర్డ్‌కు డైరెక్టర్లను ట్రూ నార్త్‌ నామినేట్‌ చేయనున్నది. మరోవైపు మ్యాక్స్‌ ఇండియా నామినేట్‌ చేసిన డైరెక్టర్లు వైదొలుగుతారు. మ్యాక్స్‌ బ్రాండ్‌ను రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. ఈ రెండేళ్లలో దశలవారీగా మరో కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తారు. బుపా బ్రాండ్‌ నేమ్‌ మాత్రం కొనసాగుతుంది. ఇక ఈ వాటా విక్రయం ద్వారా లభించిన రూ.511 కోట్లను ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని మ్యాక్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనల్జిత్‌ సింగ్‌ చెప్పారు. కాగా భారత్‌లో ఆరోగ్య బీమా రంగం వృద్ధి చెందుతోందని, ఆరోగ్య బీమా రంగంలో మాక్స్‌ బుపాను అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా రూపొందించడమే తమ లక్ష్యమని ట్రూ నార్త్‌ పార్ట్‌నర్‌ దివ్య సెహ్‌గల్‌ చెప్పారు.

ఈ లావాదేవీ విషయంలో మ్యాక్స్‌ ఇండియా కంపెనీకి ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా కేపీఎమ్‌జీ కార్పొరేట్‌ ఫైనాన్స్‌   వ్యవహరిస్తోంది. ఏజడ్‌బీ అండ్‌ పార్ట్‌నర్స్‌, ఖైతాన్‌ అండ్‌ కోలు న్యాయ సలహాదారులుగా వ్యహరిస్తున్నాయి. 

ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌...
1999 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రూ నార్త్‌(ఇండియా వేల్యూ ఫండ్‌ అడ్వైజర్స్‌-ఫోర్‌ఎఫ్‌ఏ)మధ్య తరహా లాభదాయక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, వాటిని ప్రపంచ స్థాయి ఉన్నత సంస్థలుగా మార్చుతోంది. ట్రూ నార్త్‌ సంస్థ ఇప్పటికే ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ను ఆరంభించింది. వీటి మొత్తం నిధులు 280 కోట్ల డాలర్లను మించి పోయాయి. కాగా ఇంగ్లాండ్‌కు చెందిన హెల్త్‌కేర్‌ సర్వీసుల దిగ్గజ సంస్థ, బుపా, మ్యాక్స్‌ ఇండియా కంపెనీలు కలసి  మాక్స్‌ బుపా జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి.You may be interested

అమెజాన్‌ డైరెక్టర్‌గా ఇంద్రా నూయి

Wednesday 27th February 2019

అమెజాన్‌కు రెండో మహిళ డైరెక్టర్‌  వాషింగ్టన్‌: పెప్సికో కంపెనీకి సీఈఓగా పనిచేసిన  భారత సంతతి ఇంద్రా నూయి(63) అమెజాన్‌ కంపెనీ డైరెక్టర్‌ అయ్యారు. ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం, అమెజాన్‌లో డైరెక్టర్‌ అయిన రెండో మహిళ ఇంద్రా నూయి. ఈ నెలారంభంలోనే స్టార్‌బక్స్‌ ఎగ్జిక్యూటివ్‌​ రోసలిండ్‌ బ్రెవర్‌ అమెజాన్‌లో డైరెక్టర్‌గా చేరారు. ఒక్క నెలలోనే ఇద్దరిని కొత్త డైరెక్టర్లుగా నియమించామని, వీరిద్దరికీ స్వాగతమని అమెజాన్‌ పేర్కొంది. ఇంద్రా నూయి ఆడిట్‌ కమిటీ సభ్యురాలిగా

టాప్‌ 10లో ముక్యాష్‌

Wednesday 27th February 2019

ప్రపంచ సంపన్నుల్లో పదో స్థానం రూ.3.83 లక్షల కోట్ల సంపద అఘాతానికి అనిల్‌ నికర విలువ ప్రపంచ నంబర్‌ 1 మళ్లీ జెఫ్‌ బెజోస్‌ హూరూన్‌ ప్రపంచ సంపన్నుల 2019 నివేదిక విడుదల ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సామ్రాజ్యాధిపతి ముకేశ్‌ అంబానీ సంపద పరంగా ప్రపంచంలో టాప్‌ -10కు చేరుకున్నారు. ఆయన సంపద విలువ 54 బిలియన్‌ డాలర్లు (రూ.3.83 లక్షల కోట్లు) అని హరూన్‌ ప్రపంచ సంపన్నుల జాబితా 2019 వెల్లడించింది. ముకేశ్‌ తమ్ముడు అనిల్‌

Most from this category