STOCKS

News


అంతర్జాతీయ సర్వర్ల నుంచి భారత యూజర్ల డేటా తొలగింపు

Monday 17th December 2018
news_main1545034168.png-22988

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా భారత యూజర్ల డేటాను స్థానికంగానే భద్రపర్చేందుకు చర్యలు తీసుకున్నట్లు చెల్లింపు లావాదేవీల సంస్థ మాస్టర్‌కార్డ్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా తమ అంతర్జాతీయ సర్వర్ల నుంచి ఈ డేటాను డిలీట్ చేస్తున్నట్లు సంస్థ భారత విభాగం ప్రెసిడెంట్ పొరష్‌ సింగ్‌ తెలిపారు. అయితే, కాలక్రమంలో ఇది డేటా భద్రతను బలహీనపర్చే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాస్టర్‌కార్డ్‌ సుమారు 200 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోన్నప్పటికీ .. భారత్ తరహాలో ఏ దేశం కూడా గ్లోబల్ సర్వర్ల నుంచి క్లయింట్ల డేటాను తొలగించాలని ఆదేశాలివ్వలేదని సింగ్ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన డేటా లోకలైజేషన్ నిబంధనలకు అనుగుణంగా కొత్తగా భారత్‌లో జరిగే లావాదేవీల డేటా అంతటిని అక్టోబర్‌ 6 నుంచి పుణెలోని టెక్నాలజీ సెంటర్‌లోనే భద్రపరుస్తున్నామని తెలిపారు. నిర్దిష్ట తేదికి ముందు డేటాను డిలీట్ చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆర్‌బీఐకి సమర్పించామన్నారు. అయితే .. దీనివల్ల తత్సంబంధిత డేటా అందుబాటులో లేకుండా పోవడం వల్ల పాత లావాదేవీలపై వివాదాలేమైనా తలెత్తిన పక్షంలో పరిష్కరించుకోవడం కష్టతరంగా మారొచ్చని సింగ్ తెలిపారు. ఇదే విషయం ఆర్‌బీఐకి కూడా తెలియజేశామన్నారు. 



You may be interested

క్లిష్ట సమయాల్లోనూ స్థిరమైన పనితీరు

Monday 17th December 2018

ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న తలంపుతో ఉన్న వారు ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ ఏడాది మార్కెట్‌ కరెక్షన్‌లో ఈ పథకం నష్టాలను సూచీలతో పోలిస్తే తక్కువకు పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ సగటున 10 శాతం నష్టాలను ఇవ్వగా, ఇన్వెస్కో ఇండియా కేవలం 3.8 శాతానికే నష్టాలను తగ్గించుకుంది. ఈ పథకం మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌

10725-10,675 మధ్య నిఫ్టీకి గట్టి మద్దతు..

Monday 17th December 2018

బెంచ్ మార్క్ ఇండెక్స్ లైన నిఫ్టీ, సెన్సెక్స్ గత వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అయ్యాయి. మార్కెట్లు ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా వంటి ప్రతికూలతలను ఎదుర్కొంది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ చేశాయి. మార్కెట్ ట్రెండ్ రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్లపై ఆధారపడొచ్చు. మార్కెట్లో స్టాక్ ఆధారిత పనితీరు ఉండొచ్చు. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ మంచి పనితీరు కనబర్చవచ్చు. అలాగే

Most from this category