మారుతీ సుజుకీ... మహా పతనం ఎందుకు?
By D Sayee Pramodh

36 రోజుల్లో 26 శాతం క్షీణించిన షేరు
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ షేరు గత నెల రోజులుగా భారీ కరెక్షన్లోకి జారుకుంది. ఆగస్టు 28న 9400 రూపాయల వద్ద ఉన్న మారుతీ షేరు ధర అక్టోబర్ 5 నాటికి 6900 రూపాయలకు దిగివచ్చింది. అంటే దాదాపు నెల రోజుల్లో సుమారు 26 శాతం క్షీణించింది. బ్రోకరేజ్‌లు మెచ్చిన మారుతీ షేరు ఇంతలా పతనం కావడం రిటైల్ ఇన్వెస్టర్లను నివ్వెర పరుస్తోంది. గతేడాది ఒకదశలో ఈ షేరు 9800 రూపాయలను సైతం తాకింది. అలాంటిది ఉన్నట్లుండి ఇంతలా కుప్పకూలడం సామాన్య మదుపరికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. పైకి ఎటువంటి సమస్యలు కానరాకున్నా మారుతీ ఎందుకింత పడిపోతుందనేందుకు కారణాలున్నాయంటున్నారు నిపుణులు.
స్పీడ్ బ్రేకర్లు ఇవే...
1. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుదల: అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర ఉన్నట్లుండి భారీగా పెరగడం ఆటో రంగంపై తీవ్ర నెగిటివ్ ప్రభావం చూపుతోంది. 2016లో 41 డాలర్లున్న బ్రెంట్ ధర దాదాపు 110 శాతం ర్యాలీ చేసి ప్రస్తుతం 85 డాలర్లకు అటుఇటుగా కదులుతోంది. నవంబర్ ఉంచి ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి వచ్చేస్తున్నందున ముడి చమురు కొరత మరింత పెరిగి బ్రెంట్ ధర ఇంకా పైపైకి పోతుందన్న భయాలున్నాయి.
2. కరెన్సీ కష్టాలు: ఒకపక్క డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండగా, మరోపక్క జపాన్ యెన్ విలువ పెరుగుతూపోతోంది. యెన్‌లో 1 శాతం పెరుగుదల మారుతీ ఈపీఎస్‌పై 0.7 శాతం భారం మోపుతుందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది.
3. వెయిటింగ్ పిరియడ్: ప్రీబుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వాహనాన్ని డెలివరీ చేసే సమయం పెరిగిపోవడం కస్టమర్లలో అసంతృప్తికి కారణమవుతోంది. ముఖ్యంగా కంపెనీ పోర్టుఫోలియోలో ప్రధాన వాటా ఉన్న స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, బెలెనో కార్ల వెయింటింగ్ సమయం మూడునెలలను దాటింది.
4. డిస్కౌంట్లు: ఎంట్రీ లెవల్ మోడళ్లపై కంపెనీ దాదాపు 60వేల రూపాయల వరకు డిస్కౌంట్‌నిస్తోంది. దీంతో కంపెనీ లాభాలపై ప్రభావం పడుతోందని నిపుణుల అంచనా.
5. పెరుగుతున్న ఉత్పాదకాల ధరలు: దేశంగా స్టీలు ధరలు టన్నుకు దాదాపు 1500 రూపాయల వరకు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా అల్యూమినియం ధరల్లో 8 శాతం పెరుగుదల కనిపించింది. బేస్మెటల్స్ ధరలో 10 శాతం పెరుగుదల ఉంటే వాహనాల ధరను 1- 1.5 శాతం వరకు పెంచాల్సి వస్తుందని డాయిష్‌బ్యాంక్ తెలిపింది.
6. కేరళ వరదలు: కంపెనీకి గట్టి పట్టున్న కేరళలో సంభవించిన భారీ వరదలు అమ్మకాలను కుంగదీశాయి. దీంతో 40 శాతం వరకు ఇన్వెంటరీ మిగులు సంభవించింది.
ఇవన్నీ కలగలిసి మారుతీ సుజుకీ షేరును దెబ్బతీశాయి. అయితే కంపెనీ మూలాలు బలంగా ఉన్నందున వీలు చూసుకొని పోర్టుఫోలియోలో చేర్చుకోవచ్చని మెజార్టీ బ్రోకరేజ్‌లు రికమండ్ చేస్తున్నాయి.
You may be interested
మార్కెట్‌కు ‘‘ఆర్బీఐ పాలసీ’’ షాక్
Friday 5th October 2018792 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 283 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ యథాతధ పాలసీ ప్రకటనతో పాటుఆయిల్రంగ షేర్ల భారీ పతనంతో మార్కెట్ మూడో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 792 పాయింట్లు నష్టపోయి 34,377 వద్ద, నిఫ్టీ సూచి 283 పాయింట్ల నష్టంతో 10,316 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లో నెలకొన్న అమ్మకాల పరంపరలో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడేలో 964 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 337 పాయింట్లను
రికవరీ కన్నా ముందు మరింత పతనం!
Friday 5th October 2018దేశీ మార్కెట్‌పై సీఎల్ఎస్ఏ క్రిస్‌వుడ్ అంచనా భారత మార్కెట్లు బాగుపడేముందు మరింత పతనానికి గురవుతాయని సీఎల్ఎస్ఏ అనలిస్ట్ క్రిస్‌వుడ్ అంచనా వేశారు. ఇప్పుడున్న స్థాయిల నుంచి మరింత పతనమయ్యాకనే సూచీలు తిరిగి పాజిటివ్ అడుగులు వేస్తాయన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం బయటపడ్డాక వచ్చిన పతనంతో తమ ఆసియా పోర్టుఫోలియో బాగా దెబ్బతిన్నదని చెప్పారు. తమ పెట్టుబడుల్లో 49 శాతం ఇండియాలో ఉన్నాయన్నారు. ఇందులో సింహభాగం వాటా ఫైనాన్షియల్స్దే కావడం గమనార్హం. తాజా పతనంలో