STOCKS

News


నవంబర్‌ మారుతి అమ్మకాలు మందగించాయ్‌

Saturday 1st December 2018
news_main1543645503.png-22559

మారుతి విక్రయాలు నవంబర్‌లో స్వల్పంగా మందగించాయి. ఎంట్రీ లెవల్‌ కార్లకు డిమాండ్‌ పెరగడం, ఎగుమతులు భారీగా క్షీణించడటం విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్‌లో మొత్తం 1.53లక్షల యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో విక్రయించిన మొత్తం 1.54లక్షల యూనిట్లతో పోలిసే ఇది 0.7శాతం తక్కువ. మిని సిగ్మెంట్‌ విభాగంలోని అల్టో, వేగానర్‌ కార్ల అమ్మకాలు ఈ నెలలో 21.6శాతం క్షీణించాయి. గతేడాది నవంబర్‌లో ఈ విభాగంలో మొత్తం 38,204 యూనిట్లను విక్రయించగా ఈ నవంబర్‌లో 29, 954యూనిట్ల అమ్మకాలు జరిగాయి. కాంపాక్ట్‌ విభాగంలో అమ్మకాలు 10.8శాతం పెరిగాయి. నవంబర్‌లో మొత్తం విక్రయాలు 10.8శాతం పెరిగి 72,533 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నవంబర్‌లో 65,447 యూనిట్లను విక్రయించింది. మిడ్‌-సైజ్‌ విభాగంలో సైతం అమ్మకాల తగ్గుముఖం పట్టాయి. ఈ నవంబర్‌లో మొత్తం 3838 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నవంబర్‌లో విక్రయించిన 4009 యూనిట్లతో పొలిస్తే ఇది 4.3శాతం తక్కువ. యుటిలిటీ వాహనాలను ఈ నవంబర్‌లో 23,512 వాహనాలను విక్రయించింది. ఎగుమ తులపరంగాచూస్తే 19.1 శాతం తగ్గాయి. ఈ నవంబర్‌లో మొత్తం 7,521 యూనిట్లను విదేశాలను ఎగుమతి చేసింది. గతేడాది ఇదే నెలలో మొత్తం ఎగుమతులు 9,300యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.



You may be interested

7 ఏళ్ల తర్వాత అదిరిపోయే పనితీరు

Saturday 1st December 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.79 శాతం లేదా 200 పాయిం‍ట్ల లాభంతో 25,538 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.81 శాతం లేదా 22 పాయింట్ల లాభంతో 2,759 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.79 శాతం లేదా 57 పాయింట్ల లాభంతో 7,330 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికం, యుటిలిటీస్‌, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు ర్యాలీ చేశాయి.

10,900 పైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 1st December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాలతోనే ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 2 పాయింట్ల లాభంతో 10,912 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,900 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన

Most from this category