News


మారుతి కార్లు ప్రియం

Friday 11th January 2019
news_main1547184909.png-23521

న్యూఢిల్లీ: ముడివస్తువుల ధరలు పెరుగుతుండటం, విదేశీ మారకం రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి అంశాల నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల రేట్లను పెంచింది. వివిధ కార్ల మోడల్స్‌పై ఈ పెంపు రూ. 10,000 దాకా (ఢిల్లీ ఎక్స్‌ షోరూం) ఉంటుందని, ఇది తక్షణమే అమల్లోకి వచ్చిందని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు అన్ని మోడల్స్ ధరలు పెరగ్గా.. ఇటీవలే ప్రవేశపెట్టిన ఎర్టిగా కొత్త వెర్షన్‌ని మాత్రం మారుతీ మినహాయించింది. మారుతీ సుజుకీ కార్ల శ్రేణిలో ఎంట్రీ స్థాయి అల్టో 800 నుంచి ప్రీమియం స్థాయి ఎస్‌క్రాస్‌ దాకా వివిధ మోడల్స్‌ ఉన్నాయి. వీటి ధర రూ. 2.53 లక్షల నుంచి రూ. 11.45 లక్షల దాకా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంది. జనవరి నుంచి కార్ల రేట్లు పెంచనున్నట్లు డిసెంబర్‌లోనే చెప్పినప్పటికీ.. పెంపు పరిమాణాన్ని మాత్రం అప్పట్లో ప్రకటించలేదు. మారుతీతో పాటు టయోటా కిర్లోస్కర్‌, ఇసుజు మోటార్స్ ఇండియా మొదలైనవి కూడా జనవరి నుంచి తమ వాహనాల రేట్లను పెంచనున్నట్లు గతంలో ప్రకటించాయి.



You may be interested

సమీపకాలం ‘‘బంగారమే’’

Friday 11th January 2019

ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి డాలర్‌ వరకూ.. పసిడి డిమాండ్‌ పెరుగుదలకు దోహదం వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా- ముంబై: బంగారం డిమాండ్‌ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది.   ఈ ఏడాది (2019) డిమాండ్‌ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్‌ మార్కెట్ల పనితీరు, భారత్‌సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్‌

చిన్న వ్యాపారులకు భారీ ఊరట

Friday 11th January 2019

రూ.40 లక్షల టర్నోవర్‌పై జీఎస్టీ లేదిక మినహాయింపు పరిమితి రెట్టింపు కేరళ చేతికి ఒక శాతం విపత్తు సెస్సు రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతమే పన్ను వచ్చే ఏప్రిల్‌ నుంచి అమల్లోకి జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక

Most from this category