STOCKS

News


కొత్త బాలెనో’ బుకింగ్స్‌ షురూ..

Wednesday 23rd January 2019
news_main1548220525.png-23744

ప్రారంభ చెల్లింపు రూ.11,000  న్యూఢిల్లీ: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారు కొత్త వెర్షన్‌ ముందస్తు బుకింగ్స్‌ను.. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రారంభించింది. రూ.11,000 ఇనీషియ‌ల్ పేమెంట్‌ కింద చెల్లించి నూతన కారును బుక్‌ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల్లో ఈ నూతన వెర్షన్‌ మార్కెట్లోకి విడుదల కానుండగా.. ఫిబ్రవరి తొలినాళ్లలోనే లాంచింగ్‌ కార్యక్రమం ఉండవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కారు ముందు వైపు డిజైన్‌ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అతివేగాన్ని తెలియజేసే వ్యవస్థ, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈ నూతన వెర్షన్‌లో ఉన్నాయి.’ అని ఎంఎస్‌ఐ ప్రకటనలో పేర్కొంది.



You may be interested

అందరికీ ఆర్థిక వృద్ధి ఫలాలు

Wednesday 23rd January 2019

- ప్రపంచీకరణ తర్వాతి దశ ఇదే - టెక్నాలజీతో సమస్యల పరిష్కారం - డబ్ల్యూఈఎఫ్‌లో సత్య నాదెళ్ల పిలుపు దావోస్‌: ప్రపంచీకరణలో తర్వాతి దశ ఆర్థికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అలాగైతేనే ఆకలితో అల్లాడే ప్రజలను, క్యాంపుల్లో కాందిశీకులను లేకుండా చేయగలమన్నారు. ప్రస్తుతం స్తంభించిపోయిన ఆర్థిక వృద్ధిని మళ్లీ పట్టాల మీదికి ఎక్కించేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ

టయోటా- ప్యానాసోనిక్‌ జట్టు

Wednesday 23rd January 2019

- ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీ తయారీకి జేవీ - 2020 కల్లా ఏర్పాటు! టోక్యో: ఎలక్ట్రిక్‌ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్‌ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది. బ్యాటరీలు కీలకం టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో

Most from this category