News


ఆవిష్కరణలకు మారుతి సుజుకి ప్రోత్సాహం

Tuesday 22nd January 2019
news_main1548131214.png-23722

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌, రవాణాలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఇండియా ముందుకు వచ్చింది. మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (ఎంఏఐఎల్‌) కార్యక్రమం కింద... భవిష్యత్తు కాలానికి, కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన నవ్యత, కటింగ్‌ ఎడ్జ్‌ సొల్యూషన్లను గుర్తించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆటోమొబైల్‌, రవాణా రంగానికి సంబంధించి తమ ప్రతిభను జాతీయ స్థాయిలో నిరూపించుకునేందుకు తమ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘ఎంఏఐఎల్‌ ద్వారా స్టార్టప్‌లు తమ సామర్థ్యాలను తెలియజేయవచ్చు. కనెక్టెడ్‌కార్లు, షేర్డ్‌ మొబిలిటీ, స్వయం చోదక కార్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇన్‌ఫ్రా విభాగంలో తదుపరి తరం ఐడియాలతో ముందుకు రావచ్చు’’అని మారుతి సుజుకి ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు.



You may be interested

కొన్ని కంపెనీలు త్రైమాసిక ఫలితాల వివరాలు

Tuesday 22nd January 2019

జస్ట్ డయల్ లాభం రెట్టింపు న్యూఢిల్లీ: లోకల్ సెర్చి ఇంజిన్ సంస్థ జస్ట్ డయల్ నికర లాభం అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో రెట్టింపై రూ. 57 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 28.6 కోట్లు. మరోవైపు కంపెనీ ఆదాయం రూ. 199 కోట్ల నుంచి రూ. 261 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో షేరు ఒక్కింటికి రూ. 800 ధరతో 27.5 లక్షల షేర్ల బైబ్యాక్ పూర్తిచేసినట్లు, ఇందుకోసం దాదాపు రూ.

వైద్య వ్యయాల తగ్గింపై కేంద్రం దృష్టి

Tuesday 22nd January 2019

- కొన్ని వైద్య పరికరాలపై కస్టమ్స్‌ సుంకం కోత? - బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: రోగులకు వైద్య వ్యయాల తగ్గింపు లక్ష్యంగా రానున్న వార్షిక బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కొన్ని వైద్య పరికరాలపై దిగుమతి సుంకాల తగ్గింపును కేంద్రం పరిశీలిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ముక్కుకు సంబంధించి ఆపరేషన్‌లో వినియోగించే పీడీఎస్‌ ప్లేట్స్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి 2.5 శాతానికి

Most from this category