STOCKS

News


మారుతీ కార్ల ఉత్పత్తిలో కోత

Tuesday 19th March 2019
news_main1552977574.png-24683

- ఫిబ్రవరిలో 8 శాతం పైగా కట్‌
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో 8 శాతం పైగా కోత విధించింది. స్టాక్‌ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ గత నెల 1,48,959 యూనిట్లు తయారు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన 1,62,524 యూనిట్లతో పోలిస్తే ఇది 8.3 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆల్టో, స్విఫ్ట్‌, విటారా బ్రెజా తదితర ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 8.4 శాతం తగ్గింది. గత ఫిబ్రవరిలో 1,61,116 యూనిట్లతో పోలిస్తే 1,47,550 యూనిట్లకు క్షీణించింది. అయితే ఈకో, ఆమ్ని వంటి వ్యాన్స్ విభాగం ఉత్పత్తి 13,827 యూనిట్ల నుంచి 22.1 శాతం వృద్ధితో 16,898 యూనిట్లకు పెరిగింది. సూపర్‌ క్యారీ ఎల్‌సీవీ తయారీ ఒక్క యూనిట్ మేర పెరిగింది. అటు ఉత్పత్తిలో కోతకు కారణాలపై స్పందించేందుకు మారుతీ సుజుకీ నిరాకరించింది. మారుతీ సుజుకీ ఉత్పత్తి జనవరిలో 1,58,396 యూనిట్ల నుంచి 15.6 శాతం వృద్ధితో 1,83,064 యూనిట్లకు చేరింది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 1,56,168 యూనిట్ల నుంచి 14.3 శాతం వృద్ధి చెంది 1,78,459 యూనిట్లకు పెరిగింది. అమ్మకాల విషయానికొస్తే.. జనవరిలో మారుతీ సుజుకీ విక్రయాలు 1.1 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో నమోదైన 1,40,600 యూనిట్ల నుంచి 1,42,150 యూనిట్లకు చేరాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం దేశీ విక్రయాలు 0.9 శాతం క్షీణించి 1,39,100 యూనిట్ల నుంచి 1,37,900 యూనిట్లకు తగ్గాయి. కంపెనీకి గురుగ్రామ్‌, మానెసర్‌లో 15.5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో రెండు ప్లాంట్లు ఉన్నాయి. దీంతో పాటు మాతృసంస్థ సుజుకీకి గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌ ప్లాంటులో 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఒక లైన్ ఉంది. 



You may be interested

నెల రోజులకోసం టాప్‌ సిఫార్సులు

Tuesday 19th March 2019

వచ్చే నెల రోజుల్లో దాదాపు 13 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. మిడ్‌టర్మ్‌లో నిఫ్టీ 12400 పాయింట్లను చేరవచ్చని అంచనా వేసింది.  1. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 96. స్టాప్‌లాస్‌ రూ. 81. బుల్లిష్‌ సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి రెండు వారాల క్రితం పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. దీంతో షేరులో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని నిర్ధారణ వచ్చింది. గత ఐదు సెషన్లుగా స్టాకు

మార్కెట్లోకి స్కోడా ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ కారు

Tuesday 19th March 2019

- ధర రూ. 15.49 లక్షలు నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా తమ ప్రీమియం సెడాన్ కారు ఆక్టావియాలో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు (పెట్రోల్‌ ఇంజిన్‌) ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇక డీజిల్‌ వేరియంట్ రేటు రూ. 16.99 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్

Most from this category