STOCKS

News


మారుతీ లాభం 17శాతం డౌన్‌..!

Saturday 26th January 2019
Markets_main1548488437.png-23816

  • రూ. 1,489 కోట్లుగా నమోదు
  • ఒక త్రైమాసికంలో ఇంత క్షీణత అయిదేళ్లలో ఇదే తొలిసారి-
  • తగ్గిన అమ్మకాలు, ముడివస్తువుల ధరల పెరుగుదల కారణం

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం (ఎంఎస్‌ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో త్రైమాసికంలో కూడా క్షీణించింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 10 శాతం క్షీణత నమోదు చేసిన మారుతీ తాజాగా డిసెంబర్‌ క్వార్టర్‌లోనూ అదే తీరు కొనసాగించింది. అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 17 శాతం క్షీణించి రూ. 1,489 కోట్లకు పరిమితమైంది. గడిచిన అయిదేళ్లలో చూస్తే ఒక త్రైమాసికంలో మారుతీ లాభం ఇంత భారీగా క్షీణించడం ఇదే ప్రథమం. 2013-14 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికర లాభం అత్యధికంగా 35.46 శాతం క్షీణించి రూ. 800 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో సంస్థ లాభం రూ. 1,799 కోట్లు. ఇక, అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో మారుతీ ఆదాయం మాత్రం 5 శాతం పెరిగి రూ. 19,528 కోట్ల నుంచి రూ. 20,586 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో అమ్మకాలు స్వల్పంగా 0.6 శాతం క్షీణించి 4,28,643 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఒకేసారిగా చుట్టుముట్టిన సమస్యలు..
మూడో త్రైమాసికంలో పలు ప్రతికూల అంశాలు ఒకేసారిగా చుట్టుముట్టడంతో లాభాలపై ప్రభావం పడిందని మారుతీ సుజుకీ పేర్కొంది. పండుగ సీజన్‌లో వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, కమోడిటీల ధరలు భారీగా పెరిగిపోవడం, విదేశీ మారక విలువ అనుకూలంగా లేకపోవడం, మార్కెటింగ్‌..సేల్స్ వ్యయాలు భారీగా పెరగడం తదితర అంశాలు క్యూ3లో ప్రభావం చూపినట్లు మారుతీ పేర్కొంది.  అయితే, వ్యయాల నియంత్రణ దిశగా ఉద్యోగులు, సరఫరాదారుల నుంచి వచ్చిన కొన్ని సూచనలు అమలు చేయడంతో ప్రతికూల ప్రభావం కాస్త తగ్గిందని మారుతీ పేర్కొంది. పండుగ సీజన్‌లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దాదాపు 90,000 యూనిట్ల మేర స్టాక్‌ను విక్రయించుకునేందుకు డీలర్లకు మరింత తోడ్పాటు అందించినట్లు వివరించింది. మూడో త్రైమాసికంలో పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని.. మార్కెట్‌ బలహీనంగా ఉందన్న కోణంలో మాత్రమే చూడాల్సి ఉంటుందని మారుతీ పేర్కొంది. అటు అంతర్జాతీయంగా మార్కెట్లు కూడా బాగాలేకపోవడం, పలు కరెన్సీల డీవేల్యుయేషన్ మొదలైన అంశాల కారణంగా ఎగుమతులు కూడా 8.5 శాతం క్షీణించినట్లు వివరించింది. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం 8-10 శాతం పెరగొచ్చని ముందుగా అంచనా వేసినప్పటికీ... తొలి మూడు త్రైమాసికాల్లో కలిపి ఈ రంగం కేవలం 4.4 శాతమే వృద్ధి సాధించింది. ఇక మూడో త్రైమాసికంలో 0.8 శాతం క్షీణించింది.You may be interested

వ్యాపార పద్మశ్రీలు వీరే..!

Saturday 26th January 2019

అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌... ఇది మౌలిక సదుపాయాల రంగానికి చెందిన విఖ్యాత కంపెనీ ఎల్‌అండ్‌టీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఏఎం నాయక్‌ (77) పూర్తి పేరు. ఎల్‌అండ్‌టీ కంపెనీలో 1965 మార్చి 15న జూనియర్‌ ఇంజనీర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆ సంస్థను నడిపించే స్థాయికి చేరుకుని... ఉక్కులాంటి కంపెనీగా తీర్చిదిద్దారు. కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, ఐటీ సేవలు, ఆర్థిక సేవల్లోకీ విస్తరింపజేశారు. ఆయన

1300డాలర్ల పైన ముగిసిన పసిడి

Saturday 26th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రాత్రి 1300 డాలర్ల పైన ముగిసింది. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) కీలక వడ్డీ రేట్లపై తటస్థ విధానాన్ని అవలంభించవచ్చనే అంచనాలతో రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 96స్థాయిని కోల్పోయింది. పసిడి ధరకు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ పతనం కూడా పసిడి ర్యాలీకి తోడ్పాటును అందించింది. ఫలితంగా నిన్న రాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర ఒకానొక దశలో 24.45

Most from this category