News


మార్కెట్లను మెప్పించని మారుతి డిసెంబర్‌ అమ్మకాలు

Tuesday 1st January 2019
news_main1546352295.png-23349

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి డిసెంబర్‌ అమ్మకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. కంపెనీ ఈ డిసెంబర్‌లో మొత్తం 1.28 లక్షల వాహన విక్రయాలు జరిగాయి. అయితే నోమురా సంస్థ డిసెంబర్‌లో 1.30లక్షల వాహన విక్రయాలు జరగవచ్చని అంచనావేసింది. గతేడాది ఇదే నెలలో జరిగిన దేశీయంగా అమ్మకాలతో పోలిస్తే స్వల్పంగా 1.8శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం 1.21 లక్షలుగా నమోదయ్యాయి. అయితే విదేశాలకు ఎగుమతులు మాత్రం 36.4శాతం క్షీణించి 6,859 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్‌లో ఆర్థిక వృద్ధి మందగమనంతో పాటు, ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు క్షీణత విక్రయాలపై ప్రభావాన్ని చూపినట్లు కంపెనీ తెలిపింది. పాసింజర్‌ అమ్మకాలు 4.7శాతం క్షీణించి 83,729 యూనిట్లుగా నమోదయ్యాయి. చిన్న కార్ల(ఆల్టో, వేగనార్‌) అమ్మకాలు 14శాతం క్షీణించగా, కాంపాక్ట్‌( సిఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బలెనో, డిజౌర్‌, టూర్‌ ఎస్‌) కార్ల అమ్మకాలు కాంపాక్ట్‌( సిఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బలెనో, డిజౌర్‌, టూర్‌ ఎస్‌) కార్ల అమ్మకాలు 3.8శాతం తగ్గాయి. కాలుష్యరహిత వాహనాలకు డిమాండ్‌ పెరగడంతో యుటిలిటీ వాహన విక్రయాలు 4.9శాతం పెరిగాయి. తేలికపాటి కమర్షియల్‌ విభాగంలో కంపెనీ 1,675 యూనిట్లను అమ్మింది.
ఆశించిన స్థాయిలో విక్రయ గణాంకాలు నమోదుకాకపోడంతో ఇంట్రాడే మారుతి సుజుకీ షేరు స్తబ్దుగా ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గతముగింపు(రూ.7462.3)తో పోలిస్తే 0.10శాతం నష్టపోయి రూ.7455.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

అధిక రాబడులను ఆఫర్‌ చేస్తున్న ఎన్‌సీడీలు

Tuesday 1st January 2019

ముడి చమురు ధరలు తిరిగి తక్కువ స్థాయిలకు చేరాయి. ద్రవ్యోల్బణం సౌకర్య స్థాయి 4 శాతం మార్క్‌నకు దిగువకు చేరింది. దీంతో రానున్న రోజుల్లో తక్కువ వడ్డీ రేట్లకు అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, అధిక వడ్డీ రేటు ఆశించే వారి ముందు రెండు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీ) ఇష్యూలు ఉన్నాయి. అవి కూడా పేరున్న సంస్థలు మహీంద్రా

లాభాలతో బోణి

Tuesday 1st January 2019

10900లపై ముగిసిన నిఫ్టీ ఇండెక్స్‌ కొత్త ఏడాది తొలిరోజు మార్కెట్‌ లాభాలతో బోణి చేసింది. చివరి గంటలో ఫైనాన్షియల్‌, బ్యాకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., వెనువెంటనే నష్టాల్లోకి మళ్లాయి. మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.  మిడ్‌సెషన్‌ అనంతరం సూచీలు క్రమంగా నష్టాలను పూడ్చుకుంటూ చివరిగంటలో భారీ స్థాయిలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 10,900పై ముగిసింది.

Most from this category