STOCKS

News


మణప్పురం ఫైనాన్స్‌ లాభం రూ.200 కోట్లు

Friday 10th August 2018
news_main1533897023.png-19135

న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.200 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని, 21 శాతం వృద్ధి సాధించామని మణప్పురం ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.856 కోట్ల నుంచి రూ.947 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 55 పైసల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఈ మధ్యంతర డివిడెండ్‌ను వచ్చే నెల 7వ తేదీలోగా చెల్లిస్తామని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.3,000 కోట్ల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని కంపెనీ వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మణప్పురం  ఫైనాన్స్‌ షేర్‌ 1.3 శాతం లాభంతో రూ.112 వద్ద ముగిసింది. You may be interested

వర్ల్‌పూల్‌ ఇండియా లాభం 23 శాతం అప్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: గృహోపకరణాలు తయారు చేసే వర్ల్‌పూల్‌ ఇండియా కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.133 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.164 కోట్లకు పెరిగిందని వర్ల్‌పూల్‌ ఇండియా తెలిపింది. గత ఏడాది జీఎస్‌టీ అమలుపై అనిశ్చితి కారణంగా గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో అమ్మకాలు అంతంత

ఆన్‌లైన్‌ కిరాణాపై ఫ్లిప్‌కార్ట్‌ దృష్టి

Friday 10th August 2018

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి కిరాణా సరుకుల మార్కెట్‌పై దృష్టిసారించింది. ‘నియర్‌బై’ పేరుతో అక్టోబరు 2015లో ఈ-గ్రోసరీ యాప్‌ను ప్రారంభించి కొన్ని నెలల కాలంలోనే ఈ వ్యాపారాన్ని మూసివేసిన ఈ ఆన్‌లైన్‌ సంస్థ.. అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్స్‌ వంటి బడా సంస్థలకు పోటీనివ్వడం కోసం మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరులో ఆన్‌లైన్‌ కిరాణాపై పట్టు సాధించిన ఫ్లిప్‌కార్ట్‌, ఈ విభాగంలో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది.

Most from this category