STOCKS

News


భారత్‌లో టైటానియం వరల్డ్‌ టెక్నాలజీ

Friday 12th October 2018
news_main1539317994.png-21064

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న మలేషియా కంపెనీ టైటానియం వరల్డ్‌ టెక్నాలజీ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. అనుబంధ కంపెనీ అయిన స్మార్ట్‌కోట్‌ ఇండియా ద్వారా సూక్ష్మజీవులను హరించే రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. సంస్థగత, పారిశ్రామిక వినియోగం కోసం స్మార్ట్‌కోట్‌ నానో, వ్యక్తిగత వినియోగం కోసం ఆర్మోర్‌-8 పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌కోట్‌ నానో స్ప్రే చేసిన తర్వాత దాని ప్రభావం ఏడాది పాటు ఉంటుందని స్మార్ట్‌కోట్‌ ఇండియా ఎండీ రామకృష్ణ కడియం గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. చదరపు అడుగుకు రూ.170 చార్జీ చేస్తామన్నారు. ఆర్మోర్‌-8 స్ప్రే నెల రోజులపాటు పనిచేస్తుంది. ధర 60 ఎంఎల్‌ రూ.399, 250 ఎంఎల్‌ రూ.1,499గా నిర్ణయించామన్నారు. అత్యాధునిక నానో కోటింగ్‌ టెక్నాలజీతో ఇది రూపొందాయని వివరించారు. ఉత్పత్తులకు ప్రతిష్టాత్మక సీఈ ధ్రువీకరణ ఉంది.



You may be interested

మార్కెట్లోకి టీవీఎస్‌ సరికొత్త ‘వీగో’

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ అధునాత ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్‌లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్‌, స్పోర్టి వీల్-రిమ్ స్టిక్కర్స్‌, పాస్-బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు. 110 సీసీ, పూర్తి మెటల్‌ బాడీ, అధునాతన డిజిటల్‌ స్పీడోమీటర్‌ కలిగిన ఈ స్కూటర్‌ ధర రూ.53,027

ఉత్తరాఖండ్‌లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్‌లు

Friday 12th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌... ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఆ రాష్ట్రంలో 500 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను ఒలెక్ట్రా ప్రవేశపెట్టనుంది. వీటికోసం కంపెనీ రూ.700 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సమక్షంలో ఉత్తరాఖండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఎండీ బ్రిజేష్‌ కుమార్‌ సంత్‌, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఈడీ నాగ సత్యం

Most from this category