News


జీఎంఆర్‌కు మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ షాక్‌

Friday 4th January 2019
news_main1546574425.png-23396

  • షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ రద్దు
  • డీల్‌ విలువ రూ.530 కోట్లు

హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్‌నకు మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్ బెర్హడ్‌ (ఎంఏహెచ్‌బీ) షాక్‌ ఇచ్చింది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌తో కుదిరిన షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు తేల్చిచెప్పింది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తమకున్న 11 శాతం వాటాను జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు విక్రయించేందుకు ఎంఏహెచ్‌బీ గతేడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ.530 కోట్లు. అయితే నిబంధనల ప్రకారం 2018 డిసెంబరు 31లోగా ఒప్పందాన్ని సక్రమంగా అమలుపరచని కారణంగా డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ఎంఏహెచ్‌బీ ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఐఏఎల్‌లో ఎంఏహెచ్‌బీ, ఎంఏహెచ్‌బీ (మారిషస్‌) వాటాదారుగా ఉంటాయని వెల్లడించింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో (జీహెచ్‌ఐఏఎల్‌) జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు 63 శాతం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 13, తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది.



You may be interested

నెస్లేకు మళ్లీ మ్యాగీ కష్టాలు

Friday 4th January 2019

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి మ్యాగీ నూడుల్స్ వివాదం నెస్లే ఇండియాను ఇంకా వెంటాడుతోంది. మ్యాగీ నూడుల్స్‌కి సంబంధించి కంపెనీ మీద ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం పెట్టిన కేసు విచారణపై స్టేను ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణ యథాప్రకారం కొనసాగనుంది. మ్యాగీ నూడుల్ శాంపిల్స్‌పై మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) నిర్వహించిన పరీక్షల ఫలితాలు దీనికి ప్రాతిపదికగా ఉంటాయని సుప్రీం

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 4th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి స‌న్ ఫార్మా:- పోలా ఫార్మా కొనుగోలు ప్రక్రియ‌ను పూర్తి చేసింది. పోలా ఫార్మా కొనుగోలుతో ప్రపంచవ్యాప్తంగా తమ చర్మ సంబంధింత ఔషధ విభాగం మరింత పటిష్టమవుతోందని పేర్కోంది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్ లైఫ్ ఇన్సూరెన్స్:- కంపెనీ ఎండీ&సీఈవో ప‌ద‌వికి విభా ప‌డాల్కర్ నియ‌మానికి షేర్‌హోల్డర్ల అనుమ‌తి ద‌క్కించుకుంది. టొరెంటా ఫార్మా:- థానే ప‌ట్టణానికి 20 ఏళ్ల పాటు విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఆర్డర్లను దక్కించుకుంది. ఎన్‌హెచ్‌పీసీ:- 

Most from this category