STOCKS

News


మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’

Friday 28th September 2018
news_main1538109103.png-20658

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’ పేరుతో దేశంలో తొలిసారిగా వినూత్న విధానాన్ని అక్టోబరులో పరిచయం చేయబోతోంది. సాధారణంగా ఏ హోటల్‌కు వెళ్లినా గది చార్జీ 24 గంటలుగా లెక్కకడతారు. షార్ట్‌ స్టేస్‌ విధానంలో 4 గంటల వ్యవధికి కూడా గది అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని తిరుపతిలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నట్టు మేక్‌ మై ట్రిప్‌ ఇండియా హోటల్స్‌ విభాగం చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పరిక్షిత్‌ చౌదరి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. పైలట్‌ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. చార్జీ ఒక రోజుతో పోలిస్తే నాలుగు గంటలకు 20-30 శాతం ఉంటుందని చెప్పారు. కస్టమర్‌తోపాటు హోటల్‌ యజమానికి కూడా ఈ విధానం కలిసి వస్తుందని వివరించారు. 

 



You may be interested

దివాల కేసుల పరిష్కారానికి 8 ప్రత్యేక కోర్టులు

Friday 28th September 2018

న్యూఢిల్లీ: దివాలా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి సత్వర పరిష్కారానికి గాను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలో 8 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. దేశవ్యాప్తంగా ఎన్‌సీఎల్‌టీకి 11 బెంచ్‌లు ఉన్నప్పటికీ కేసుల భారం పెరిగిపోవడంతో, దీన్ని తగ్గించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ

రూ.875 కోట్లు సమీకరించనున్న  జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌

Friday 28th September 2018

ముంబై: జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌ సంస్థ, రూ.875 కోట్ల నిధులు సమీకరించనున్నది. జేఎమ్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, విక్రమ్‌ పండిట్‌, సింగపూర్‌ జీఐసీ ఫండ్‌, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఎండోమెంట్‌ ఫండ్‌లకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌ వెల్లడించింది. ఈక్విటీ ద్వారా నిధుల సమీకరణ ప్రాతిపదికన  ఈ ఎన్‌బీఎఫ్‌సీ విలువ రూ.7,175 కోట్లుగా ఉంటుందని అంచనా. కాగా ఈ కంపెనీ ఈ ఏడాది

Most from this category