STOCKS

News


మహీంద్రా లాభం 67 శాతం జంప్‌

Tuesday 7th August 2018
news_main1533629563.png-19013

యుటిలిటీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. కంపెనీ నికర లాభం 67 శాతం వృద్ధితో రూ.1,257 కోట్లకు పెరిగింది. ఇది మార్కెట్‌ అంచనాలను మించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ రూ.752 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.13,358 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.11,006 కోట్లుగా ఉంది. ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ వార్షిక ప్రాతిపదికన 13.8 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది. 
కంపెనీ మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ1లో 20 శాతం వృద్ధితో 1,40,101 యూనిట్లకు పెరిగాయి. ట్రక్కులు, త్రీవీలర్ల బలమైన డిమాండ్‌ కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది. ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 9 శాతం వృద్ధితో 60,779 యూనిట్లకు, వాణిజ్య వాహన విక్రయాలు 23 శాతం వృద్ధితో 56,940 యూనిట్లకు ఎగశాయి. ట్రాక్టర్‌ విక్రయాలు 18.8 శాతం వృద్ధితో 1,00,784 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ 9,360 వాహనాలను ఎగుమతి చేసింది. 
స్టాండలోన్‌ ప్రాతిపదికన చూస్తే.. కంపెనీ నికర లాభం 63 శాతం వృద్ధితో రూ.749 కోట్ల నుంచి రూ.1,221 కోట్లకు చేరింది. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.12,376 కోట్ల నుంచి రూ.13,520 కోట్లకు పెరిగింది. 

ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో కంపెనీ షేరు ధర మధ్యాహ్నాం 1:37 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో 0.18 శాతం పెరుగుదలతో రూ.934.1 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

తగ్గినపుడు కొనండి..

Tuesday 7th August 2018

నాణ్యమైన స్టాక్స్‌పై దేవెన్‌ చోక్సీ సిఫార్సు రానున్న రోజుల్లో కంపెనీల ఎర్నింగ్స్‌లో బలమైన రెండంకెల వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవెన్‌ చోక్సీ. ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ వ్యాపారాల్లో మంచి పెరుగుదల నమోదవుతూ వస్తోందన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా మంచి వృద్ధి నమోదు చేస్తున్నాయని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నుంచి సాహేతుకంగా 10 శాతం రాబడులను అంచనా వేయవచ్చని పేర్కొన్నారు.

పీఎన్‌బీ నష్టం @ రూ.940 కోట్లు

Tuesday 7th August 2018

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ రూ.940 కోట్ల నికర నష్టా‍న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.343 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే మార్కెట్‌ వర్గాల అంచనా కన్నా ఈ నష్టాలు తక్కువగా ఉండటం గమనార్హం. త్రైమాసికం పరంగా చూస్తే బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏఎలు 18.38 శాతం

Most from this category