STOCKS

News


మహీంద్రా సీఐఈ చేతికి ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌

Wednesday 13th March 2019
Markets_main1552457403.png-24573

డీల్‌ విలువ రూ.876 కోట్లు  

న్యూఢిల్లీ: ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీని(ఏఈఎల్‌) వాహన విడిభాగాల సంస్థ, మహీంద్రా సీఐఈ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని మహీంద్రా సీఐఈ వెల్లడించింది. ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌లో మొత్తం వాటాను రూ.876 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ అండెర్‌ అరెనాజ తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుతో తాము అల్యూమినియమ్‌ డై కాస్టింగ్‌ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశిస్తామని చెప్పారాయన. వచ్చే నెల 10లోపు ఈ డీల్‌ పూర్తవ్వగలదని అంచనా. కాగా, ఎమ్‌సీఐఈ, సీఐఈలతో భాగస్వామ్యం తమ కంపెనీకి మంచి జోరునిస్తుందని ఏఈఎల్‌  సీఎమ్‌డీ రిషి బగ్లా చెప్పారు. ఈ డీల్‌ ద్వారా లభించిన నిధులను తమ ఇతర వ్యాపారాలు, పారిశ్రామిక కార్యకలాపాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. 
1985లో ప్రారంభమైన ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ అల్యూమినియమ్‌ డై-కాస్టింగ్‌ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి ఔరంగాబాద్‌, పుణే, పంత్‌నగర్‌ల్లో ఐదు ప్లాంట్లున్నాయి. వీటిలో మొత్తం 3,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్షిక విక్రయాలు రూ.850 కోట్ల మేర ఉన్నాయి. ఇక స్పెయిన్‌కు చెందిన సీఐఈ ఆటోమోటివ్‌లో భాగమైన మహీంద్రా సీఐఈలో మహీంద్రా గ్రూప్‌నకు 11.5 శాతం వాటా ఉంది.You may be interested

'ప్రాంతీయ' స్టార్టప్స్‌పై ఇన్వెస్టర్ల గురి

Wednesday 13th March 2019

- బీటా స్టేజ్‌లోనే ఉన్నా ఆసక్తి - లిస్టులో బుల్‌బుల్, సిమ్‌సిమ్, డీల్‌షేర్‌ తదితర సంస్థలు - జోరుగా నిధులు సమీకరణలో స్టార్టప్స్‌ బెంగళూరు: వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు తాజాగా ప్రాంతీయ భాషల్లో ఈ–కామర్స్‌ సేవలందించే స్టార్టప్స్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కొత్తగా ఈ–కామర్స్‌ మార్కెట్‌కు పరిచయం కాబోయే 10 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్స్‌కి ముందుగా చేరువయ్యే సత్తా గల సంస్థలపై ఇవి దృష్టి సారిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి బడా ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో షాపింగ్‌

వచ్చే నెల్లో కొత్త రికార్డులు పక్కా?!

Wednesday 13th March 2019

నిఫ్టీపై అనలిస్టుల అంచనా కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించమని సూచన గతేడాది సాధించిన 11760.20 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని వచ్చే నెల్లో దాటుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించవచ్చని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే సూచీలు సరికొత్త శిఖరాలు తాకుతాయని మార్కెట్‌ వర్గాల్లో అధికశాతం భావిస్తున్నాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు కూడా పెరగడంతో సూచీల పరుగు మరింత స్పీడవుతుందని

Most from this category