STOCKS

News


నెస్లేకు మళ్లీ మ్యాగీ కష్టాలు

Friday 4th January 2019
Markets_main1546574589.png-23397

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి మ్యాగీ నూడుల్స్ వివాదం నెస్లే ఇండియాను ఇంకా వెంటాడుతోంది. మ్యాగీ నూడుల్స్‌కి సంబంధించి కంపెనీ మీద ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం పెట్టిన కేసు విచారణపై స్టేను ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణ యథాప్రకారం కొనసాగనుంది. మ్యాగీ నూడుల్ శాంపిల్స్‌పై మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) నిర్వహించిన పరీక్షల ఫలితాలు దీనికి ప్రాతిపదికగా ఉంటాయని సుప్రీం కోర్టు పేర్కొంది. మరోవైపు, సుప్రీం కోర్టు ఆదేశాలను నెస్లే స్వాగతించింది. మ్యాగీ నూడుల్స్‌లో సీసం తదితర అవశేషాలు నిర్దేశిత స్థాయిల్లోనే ఉన్నాయని సీఎఫ్‌టీఆర్‌ఐ పరీక్షల్లో తేలినట్లు పేర్కొంది. అయితే, న్యాయస్థానం ఆదేశాల కాపీ వచ్చిన తర్వాతే తమకు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించింది. వివరాల్లోకి వెళితే.. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక మోనోసోడియం గ్లూటమేట్‌ (ఎంఎస్‌జీ) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయంటూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2015లో దీన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెస్లే ఇండియా తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తోందని, తప్పుడు లేబులింగ్, అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 2015లో జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)లో ఈ కేసు దాఖలు చేసింది. రూ. 640 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది. అయితే, దీన్ని నెస్లే సవాల్ చేయడంతో సుప్రీం కోర్టు అప్పట్లో కేసు విచారణపై స్టే విధించింది. మరోవైపు మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్స్‌లో సీసం, ఎ౾ంఎస్‌జీ స్థాయులపై పరీక్షలు జరిపి నివేదికనివ్వాలంటూ సీఎఫ్‌టీఆర్‌ఐని 2016 జనవరి 13న సుప్రీం కోర్టు ఆదేశించింది. 29 శాంపిల్స్‌లో సీసం పరిమాణం నిర్దేశిత స్థాయికి లోబడే ఉందంటూ సీఎఫ్‌టీఆర్‌ఐ సుప్రీం కోర్టుకు తెలియజేసింది.You may be interested

గిఫ్ట్‌ దిగుమతులకు కేంద్రం చెక్‌

Friday 4th January 2019

కస్టమ్స్‌ నిబంధనలకు సవరణ యోచనలో కేంద్రం న్యూఢిల్లీ: గిఫ్ట్‌ ఐటమ్స్‌ దిగుమతుల నిబంధనలు దుర్వినియోగం అవుతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. కస్టమ్స్ సుంకాలను ఎగవేసే ఉద్దేశంతో బహుమతుల పేరిట రూ. 5,000 దాకా విలువ చేసే ఐటమ్స్ దిగుమతి చేసుకుంటుండటాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం రూ. 5,000 దాకా ఉన్న మినహాయింపును ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే ఒక వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా నాలుగు కన్సైన్‌మెంట్స్‌ మాత్రమే బహుమతులుగా అనుమతించే

జీఎంఆర్‌కు మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ షాక్‌

Friday 4th January 2019

షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ రద్దు డీల్‌ విలువ రూ.530 కోట్లు హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్‌నకు మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్ బెర్హడ్‌ (ఎంఏహెచ్‌బీ) షాక్‌ ఇచ్చింది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌తో కుదిరిన షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు తేల్చిచెప్పింది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తమకున్న 11 శాతం వాటాను జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు విక్రయించేందుకు ఎంఏహెచ్‌బీ గతేడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం

Most from this category