STOCKS

News


ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఎంఅండ్‌ఎం ఇ- వాహనాలు

Friday 26th April 2019
news_main1556253804.png-25359

హైదరాబాద్‌, సాక్షి బిజినెస్‌: నగరంలో ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌పై తమ ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. దేశంలో తొలిసారి ఇ-వాహనాలను ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రవేశపెట్టామని, వివిధ నగరాల్లో ఉబెర్‌యాప్‌లో తమ ఇ- వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ముందుగా హైదరాబాద్‌లో 50 ఇ- వెరిటో సెడాన్‌లను అందుబాటులోకి తెచ్చామని, క్రమంగా ఇ2ఓప్లస్‌ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు మరిన్ని వాహనాలను తీసుకువస్తామని తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి తాము తొలినించి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటివరకు దాదాపు 14వేలకుపైగా ఇ-వాహనాలను తీసుకువచ్చామని మహీంద్రా ఎలక్ట్రిక్‌ సీఈఓ మహేశ్‌బాబు చెప్పారు. తాజా ఇ- వెరిటో సెడాన్‌ ఒక్కసారి చార్జింగ్‌తో దాదాపు 140 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందన్నారు. ఉబెర్‌తో భాగస్వామ్యం కోరే డ్రైవర్‌ పార్టనర్లు ఇకపై ఇ-వాహనాలను పొందవచ్చని, ఎలక్ట్రిక్‌ వాహనాలతో మామూలు డ్రైవర్‌ పార్టనర్ల కన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని ఉబెర్‌ ప్రతినిధి దీపాంకర్‌ తివారీ చెప్పారు. 
త్వరలో తెలంగాణ ఇ-వాహన పాలసీ
ఏప్రిల్‌లో కేంద్రం తీసుకువచ్చిన ఫేమ్‌-2 గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, ఈ గైడ్‌లైన్స్‌లో పొందుపరచని అంశాలను కవర్‌ చేస్తూ, రాష్ట్రస్థాయిలో ఇ-వాహనాలకోసం కొత్త పాలసీని త్వరలో తీసుకువస్తామని తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ చెప్పారు.  ఇ- వాహనాలను ప్రోత్సహించేందుకు నగరంలో విరివిగా చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం దేశంలో అత్యధిక చార్జింగ్‌ పాయింట్లున్న నగరంగా నిలిచామన్నారు. ఆర్‌టీసీ సైతం 40 ఇ-బస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో అత్యధిక ఇ-బస్‌లున్న ప్రజారవాణా వ్యవస్థగా నిలిచిందని వివరించారు. భవిష్యత్‌లో ఇ-వాహనాల వృద్దిని బట్టి మరిన్ని చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు. చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయదలిచినవాళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని చెప్పారు. ఇవాహనాల చార్జింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక టారిఫ్‌ వసూలు చేసేందుకు ఈఆర్‌సీ అంగీకరించిందన్నారు.



You may be interested

హైదరాబాద్‌ నుంచే రాకెట్ల ప్రయోగం

Friday 26th April 2019

2021లో స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌ ప్రయోగం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌’ అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించనుంది. 2021 ద్వితీయార్థంలో విక్రం సిరీస్‌తో రాకెట్లను పంపించనుంది. ఇండియన్‌ స్పేస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్తలు పవన్‌కుమార్‌ చందన, నాగ భరత్‌ దాకలు స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌ ప్రమోటర్లుగా ఉన్నారు. శాటిలైట్‌ డిజైన్, టెస్టింగ్‌ లెవల్స్‌ పూర్తయ్యాయని.. ఆ తర్వాతి అవసరాల కోసం పెట్టుబడులు అవసరమని, అందుకే రెండో

ముడిచమురు @75 డాలర్లు

Friday 26th April 2019

ఆరునెలల గరిష్ఠస్థాయి నమోదు  లండన్‌: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు మంటలు మొదలయ్యాయి. గురువారం ట్రేడింగ్‌లో బ్రెంట్‌క్రూడ్‌ ధర 75 డాలర్ల పైన ఆరునెలల గరిష్ఠస్థాయిని తాకింది. ఇరాన్‌పై ఆంక్షలతో చమురు సరఫరా అతలాకుతలం అవుతుందన్న ఆందోళనలు చమురు ధరల్లో కాక పెంచాయి. గురువారం ఇంట్రాడేలో బ్రెంట్‌ క్రూడ్‌ 75.60 డాలర్లను తాకింది. గత అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయి చూడడం ఇదే తొలిసారి. మరోవైపు డబ్ల్యుటీఐ క్రూడ్‌ సైతం ఆరునెలల గరిష్టం

Most from this category