STOCKS

News


మహీంద్రా లాభం 11శాతం డౌన్‌

Saturday 9th February 2019
Markets_main1549695174.png-24100

  • అధిక వ్యయాలతో తగ్గిన నికర లాభం
  • 15 శాతం వృద్ధితో రూ.13,411 కోట్లకు మొత్తం ఆదాయం
  • వచ్చే క్వార్టర్లో కూడా నిరాశ ఫలితాలే
  • కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా వెల్లడి


న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం(స్డాండోలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికంలో 11 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.1,216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,077 కోట్లకు తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. అమ్మకాలు మెరుగుపడ్డా, వ్యయాలు అధికమవడంతో నికర లాభం తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.11,676 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.13,411 కోట్లకు పెరిగిందని తెలిపారు. వాహన విక్రయాలు 1,21,786 నుంచి 10 శాతం పెరిగి 1,33,508కు పెరిగాయని, . ట్రాక్టర్ల అమ్మకాలు 76,943 నుంచి 13 శాతం ఎగసి 87,036కు పెరిగాయని వివరించారు. ఎగుమతులు 11,426 నుంచి 12,363కు పెరిగాయని తెలిపింది.
మార్జిన్లపై డిస్కౌంట్ల ప్రభావం....
వాహన రంగంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయని కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా వ్యాఖ్యానించారు. కరెన్సీ మారకం రేట్లలో ఒడిదుడుకులు, కమోడీటీ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం, యాక్సిల్‌ లోడ్‌ నిబంధనల కారణంగా వాహనాల ధరలు పెరగడం వంటి అంశాల కారణంగా సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని వివరించారు. పట్టణాల్లో డిమాండ్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పండగల సీజన్‌లో ప్రయాణికుల వాహన విక్రయాలు అంచనాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. పండుగల సీజన్‌ల సాధారణం కంటే 6-8 శాతం అధికంగా డిస్కౌంట్‌లు ఇచ్చామని, ఫలితంగా మార్జిన్లు 0.4 శాతం తగ్గాయని తెలిపారు. నాలుగో క్వార్టర్లో కూడా ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.


M&M

You may be interested

మార్కెట్లోకి హోండా సీబీ300 ఆర్‌

Saturday 9th February 2019

మధ్య స్థాయి ప్రీమియం బైక్‌ విడుదల ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.41 లక్షలు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ హోండా మధ్యస్థాయి ప్రీమియం విభాగంలో సీబీ300ఆర్‌ ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.41 లక్షలు. ఈ బైక్‌ 286సీసీ సామర్థ్యంతో ఉంటుంది. హోండా ప్రీమియం విభాగంలో సీబీ1000ఆర్‌ను ఇప్పటికే విక్రయిస్తుండగా, తాజాగా విడుదల చేసినది మధ్యస్థాయి ప్రీమియం విభాగం (300-600సీసీ) కిందకు వస్తుంది. ఇదే విభాగంలో

జాగ్వార్‌... మ్యావ్‌!

Saturday 9th February 2019

- జేఎల్‌ఆర్‌ దెబ్బతో భారీ నష్టాలు - బ్రెగ్జిట్, వాణిజ్య యుద్ధ భయాల రిస్కులు - మందగిస్తున్న అమ్మకాలు - కలిసిరాని వ్యూహాలు 2008... దివాలా కోరల్లోకి జారుకున్న ఫోర్డ్‌ మోటార్స్‌ తన లగ్జరీ కార్ల బ్రాండ్‌ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌)ను అమ్మకానికి పెట్టింది. అప్పటివరకూ భారతీయ కార్పొరేట్లలో ఎవ్వరూ చేయనంత సాహసాన్ని టాటా గ్రూప్‌ అధిపతి రతన్‌టాటా చేశారు. అలా పంతంపట్టి మరీ దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు(అప్పట్లో మన కరెనీ​ప్రకారం రూ.9,300 కోట్లు) వెచ్చించి

Most from this category