News


ఫార్మాలో 1,000 మందికి లుపిన్‌ శిక్షణ

Friday 7th September 2018
news_main1536296097.png-20038

 పనాజీ: ‘లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో 1,000 మంది సైన్స్‌ విద్యార్ధులకు ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు లుపిన్‌ ప్రకటించింది. ప్లెస్‌ 12 (ఇంటర్‌)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు మూడేళ్ల ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ‘2011 నుంచి ఇప్పటివరకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 560 మంది విద్యార్ధులకు శిక్షణనిచ్చాం. 2020 నాటికి మరో 1,000 మంది ప్లెస్‌ 12 పూర్తిచేసిన వారికి మూడేళ్ల ఫార్మా డిగ్రీ కోర్సును అందించనున్నాం. గోవా, ఇండోర్, సిక్కింలతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్‌, ఔరంగాబాద్‌లోని ఫెసిలిటీలలో శిక్షణ ఉంటుంది.’ అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్‌ఆర్‌) సీ శ్రీనివాసలు అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం కోసం రూ.20 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేసినట్లు ప్రెసిడెంట్ (హెచ్‌ఆర్‌) యశ్వంత్ మహాదిక్ వెల్లడించారు. కోర్సు తరువాత రెండేళ్లు లుపిన్‌లో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు.
 



You may be interested

జీతాలివ్వకుంటే సహాయ నిరాకరణే

Friday 7th September 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు తాజాగా మరో చిక్కొచ్చి పడింది. జీతభత్యాలు సత్వరం చెల్లించకపోతే ‘సహాయ నిరాకరణ' తప్పదని సంస్థ యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. "జీతాలను ఆపివేయడం.. అది కూడా ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వకుండా చేయడమన్నది చాలా తీవ్రమైన విషయం. ఇందుకు సంబంధించిన పరిణామాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేం లేవనెత్తిన సమస్యలను పరిష్కరించి, సకాలంలో జీతాలు చెల్లించని

డీఆర్‌టీలో కేసు దాఖలకు ‘పరిమితి’ రెట్టింపు

Friday 7th September 2018

న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సం‍స్థల తమ రుణ బకాయిలు రాబట్టుకునే విషయంలో డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ)లో కేసు దాఖలుకు అవసరమైన మొత్తాల పరిమితిని గురువారం కేంద్రం రూ. 20 లక్షలకు పెంచింది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిమితి 10 లక్షలు. దీనివల్ల ఇకపై రూ.20 లక్షల పైబడిన బకాయిలను రాబట్టుకోడానికి మాత్రమే డీఆర్‌టీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశ్రయించగలుగుతాయి.

Most from this category