STOCKS

News


లుపిన్‌ లాభం 43 శాతం డౌన్‌

Thursday 9th August 2018
news_main1533792944.png-19086

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ లుపిన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.358 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణత నమోదైందని లుపిన్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,807 కోట్ల నుంచి రూ.3,775 కోట్లకు తగ్గిందని లుపిన్‌ ఎండీ, నీలేశ్‌ గుప్తా తెలియజేశారు. అమెరికా, జపాన్‌ మార్కెట్లలో కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక  కాలం ఫలితాలు నిరాశమయంగా ఉన్నాయని వివరించారు. ఇబిటా 18.8 శాతంగా నమోదైందని తెలిపారు. 
26 శాతం తగ్గిన అమెరికా అమ్మకాలు..
గత క్యూ1లో రూ.1,499 కోట్లుగా ఉన్న ఉత్తర అమెరికా అమ్మకాలు ఈ క్యూ1లో 26 శాతం క్షీణించి రూ.1,186 కోట్లకు తగ్గాయని నీలేశ్‌ తెలిపారు. ఈ క్యూ1లో అమెరికా మార్కెట్లో మూడు కొత్త ఔషధాలను అందుబాటులోకి తెచ్చామని, మొత్తం అమెరికా మార్కెట్లో తమ కంపెనీ మొత్తం ఉత్పత్తుల సంఖ్య 160కు పెరిగిందని పేర్కొన్నారు. భారత్‌లో ఫార్ములేషన్‌ అమ్మకాలు 31 శాతం వృద్ధితో రూ.1,192 కోట్లకు పెరిగాయని వివరించారు.
రూ.1,771 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరి..
నికర లాభం 43 శాతం తగ్గడంతో బీఎస్‌ఈలో లుపిన్‌ షేర్‌ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో 5.4 శాతం క్షీణించిన ఈ షేర్‌ చివరకు 4.5 శాతం నష్టంతో రూ.826 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌రూ.1,771 కోట్లు తగ్గి రూ.37,341 కోట్లకు పడిపోయింది. 

 
    You may be interested

మార్కెట్లోకి మారుతీ స్విఫ్ట్‌ ఏజీఎస్‌ వేరియంట్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ స్విఫ్ట్‌కి చెందిన హై ఎండ్‌ మోడళ్లలో ఆటో గేర్‌ షిఫ్ట్‌ (ఏజీఎస్‌) సౌకర్యమున్న కార్లను మార్కెట్లోకి తెచ్చింది. దీంట్లో పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.7.76 లక్షలని, డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.8.76 లక్షలని (రెండు ధరలూ ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ) మారుతీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొంది. అప్పుడే స్విఫ్ట్‌కు చెందిన వీఎక్స్‌ఐ, జడ్‌ఎక్స్‌ఐ,

లుపిన్‌ లాభం 43 శాతం డౌన్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ లుపిన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.358 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణత నమోదైందని లుపిన్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,807 కోట్ల నుంచి రూ.3,775 కోట్లకు తగ్గిందని లుపిన్‌ ఎండీ, నీలేశ్‌ గుప్తా తెలియజేశారు. అమెరికా, జపాన్‌ మార్కెట్లలో కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉండటంతో

Most from this category