STOCKS

News


వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తున్నాం

Tuesday 5th February 2019
news_main1549347333.png-24021

 

  • -డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రకటన
  • -ఐదు రోజుల పతనం అనంతరం కోలుకున్న షేరు

ముంబై: కోబ్రోపోస్ట్‌ కథనంలో కుదేలైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌... వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తోంది. పటిష్టమైన వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తున్నామని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సీఎమ్‌డీ కపిల్‌ వాధ్వాన్‌ పేర్కొన్నారు. తాజాగా మరిన్ని పెట్టుబడులు పెట్టే, తమ వ్యాపారాలపై ముసురుకున్న ఆందోళనలను పొగొట్టే బలమైన భాగస్వామిని అన్వేషిస్తున్నామని విశ్లేషకులతో జరిపిన కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఆయన వివరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ లిక్విడిటీ సమస్యతో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. అప్పటి నుంచే వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషణ ఆరంభించామని వివరించారు. మరో మూడు నెలల్లోనీ అన్వేషణ పూర్తి కాగలదని పేర్కొన్నారు. తమకు నిధుల సమస్య లేదని మరో ఆరు నెలల వరకూ రుణాలను, మెచ్యురయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను చెల్లించగలిగే స్థాయిలో నిధులున్నాయని భరోసానిచ్చారు.
తమ కుటుంబానికి చెందిన కంపెనీలు పాలక బీజేపీకి రూ.19.5 కోట్ల విరాళాలు ఇచ్చాయని అంగీకరించారు. అయితే కోబ్రాపోస్ట్‌ చేసిన ఆరోపణలన్నీ ఆసత్యాలని ఆయన కొట్టివేశారు. కాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన వివిధ రకాలైన రుణాలకు రేటింగ్‌లను రేటింగ్‌ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్‌ చేశాయి.



You may be interested

ట్రూజెట్‌కు కొత్తగా రెండు విమానాలు

Tuesday 5th February 2019

ఏప్రిల్‌ నాటికి సంస్థలోకి డిసెంబరుకల్లా మరో మూడు ఉడాన్‌–3లో రెండు రూట్లు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్‌ ఏప్రిల్‌ కల్లా ఏటీఆర్‌ 72–500 విమానాలను మరో రెండింటిని సమకూర్చుకుంటోంది. ఇప్పటికే సంస్థ ఖాతాలో అయిదు విమానాలున్నాయి. వీటిలో ఏటీఆర్‌ 72–500 రకం మూడు, ఏటీఆర్‌ 72–600 రకం రెండు ఉన్నాయి. డిసెంబరు చివరికి మరో మూడు విమానాలు వస్తాయని, దీంతో సంస్థ వద్ద మొత్తం 10 విమానాలు కొలువుదీరతాయని ట్రూజెట్‌ను ప్రమోట్‌

మూడింతలైన ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు

Tuesday 5th February 2019

ఈ క్యూ3లో రూ.4,185 కోట్ల నష్టాలు 19 శాతం తగ్గిన నికర వడ్డీ ఆదాయం పెరిగిన మొండి రికవరీలు న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగాయి. గత క్యూ3లో  రూ.1,524 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.4,185 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం, నిర్వహణ ఆదాయం కూడా

Most from this category