STOCKS

News


10డెలివరీ.కామ్‌ సేవలు ప్రారంభం

Tuesday 20th November 2018
news_main1542685868.png-22213

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన డెలివరీ స్టార్టప్‌ 10డెలివరీ.కామ్‌ ప్రాంతీయ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఉచిత పికప్స్, వేగవంతమైన డెలివరీ తమ లక్ష్యమని 10 డెలివరీ.కామ్‌ను ప్రమోట్‌ చేస్తున్న యాడ్‌నిగమ్‌ ఫౌండర్‌ రాజిరెడ్డి కేసిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని వ్యాపారస్తులు, ట్రేడర్లకిది చాలా ఉపయుక్తంగా ఉంటుందని, డాక్యుమెంట్లు, తేలికపాటి పార్సిళ్ల వంటివి తక్కువ ధరలో డెలివరీ చేస్తామని చెప్పారాయన. తొలి ఆర్డర్‌రు రూ.10 ధరకే డెలివరీ చేస్తారు. డెలివరీ చార్జీలు డాక్యుమెంట్స్‌ కిలో వరకైతే రూ.25, పార్సిల్స్‌ 2 కిలోల వరకైతే రూ.50 వరకూ ఉంటాయని ఆయన తెలియజేశారు. మైక్రో లాజిస్టిక్‌ నిర్వహణే ఈ కంపెనీ ప్రధాన బలమని.. త్వరలోనే కార్పొరేట్‌ సంస్థలు, బల్క్‌ బుకింగ్‌ ఆర్డర్లపై దృష్టిపెడతామని రాజిరెడ్డి తెలిపారు.

 



You may be interested

నష్టాల ప్రారంభం

Tuesday 20th November 2018

10,750 దిగువున నిఫ్టీ 35,730 వద్ద సెన్సెక్స్‌ ప్రారంభం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,763 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల నష్టంతో 10,740 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,774 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 35,730 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌, ఐటీ స్టాక్స్‌ ఎక్కువగా క్షీణించాయి.  రిజర్వు బ్యాంక్‌ వ్యవస్థలో నగదు

విమాన బోర్డింగ్‌లో మార్పులు!

Tuesday 20th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: త్వరలోనే విమానాల్లో బోర్డింగ్‌ పద్ధతి మారనుంది. ఇప్పటివరకు విమానాల్లో బోర్డింగ్‌ సీట్‌ నంబర్ల ఆధారంగా వరుస క్రమంలో ఉండేది. కానీ, మున్ముందు దీని స్థానంలో విమానంలో కిటికీ దగ్గర సీటు ప్రయాణికులు ముందు, ఆ తర్వాత మధ్య సీటు వారు, ఆ తర్వాత చివరి సీటు ప్రయాణికులు ఎక్కే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ విధానంలో విమానాల బోర్డింగ్‌ సమయం 35 శాతం వరకు తగ్గుతుందనేది

Most from this category