STOCKS

News


ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు

Tuesday 15th January 2019
news_main1547534462.png-23594

  • రుణ హామీ, వడ్డీ సబ్సిడీ కల్పించే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలను ప్రోత్సహించే దిశగా కొత్త విధానంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 100 కోట్ల దాకా టర్మ్ రుణాలకు హామీనివ్వడం, రూ. 1,000 కోట్ల దాకా రుణాలకు సంబంధించి వడ్డీ సబ్సిడీనివ్వడం తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. "కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం గానీ.. ఇప్పటికే ఉన్న ప్లాంటు విస్తరణ కోసం గానీ రూ. 100 కోట్ల దాకా పెట్టుబడి అవసరమయ్యే ప్రాజెక్టులకు రుణ హామీ ఇచ్చే ప్రతిపాదన ఉంది. దీనికోసం తనఖా, థర్డ్‌ పార్టీ గ్యారంటీ అవసరం ఉండదు" అని పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం జారీ అయిన రుణంలో 50 శాతం దాకా మొత్తానికి ప్రభుత్వం రుణ హామీ కవరేజీ ఇస్తుందని వివరించాయి. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రత్యేక ఫండ్ దాదాపు రూ. 1,000 కోట్లతో ఏర్పాటు చేస్తుందని తెలిపాయి. స్పందనను బట్టి ఆ తర్వాత ఏడాది ఈ స్కీమును సమీక్షించవచ్చని అధికారులు వివరించారు. ఇక, అంతర్జాతీయ స్థాయిలో ఆమోదయోగ్యమైన వడ్డీ రేట్లకు రుణాలు లభించేలా చర్యలు తీసుకోవాలన్న ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ, వడ్డీ సబ్సిడీ అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు 5-7 శాతం స్థాయిలో ఉంటుండగా... దేశీయంగా ఎలక్ట్రానిక్స్ సంస్థలు టర్మ్ లోన్స్‌పై 11-12 శాతం మేర వడ్డీ రేటు చెల్లిస్తున్నాయి. దీంతో 4-6 శాతం దాకా సబ్సిడీ రాయితీ కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. పదేళ్ల దాకా కాలవ్యవధికి రూ. 1,000 కోట్ల దాకా రుణాలపై వడ్డీ సబ్సిడీ కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారులు చెప్పారు. అంతకు మించిన రుణ మొత్తం తీసుకున్నా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. కానీ గరిష్టంగా రూ. 1,000 కోట్లకు మాత్రమే వడ్డీ రాయితీ లభించవచ్చని పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్‌, ఫ్లెక్స్ వంటి సంస్థలకు కూడా దీనికి అర్హత ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌ను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఈ ప్రతిపాదనల అమలు తోడ్పడగలదని ఇండియా సెల్యులార్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు.



You may be interested

ఈ-కామర్స్ నిబంధనలతో ఆఫ్‌లైన్ రిటైలర్లకు లబ్ధి

Tuesday 15th January 2019

 రూ. 12,000 కోట్ల దాకా పెరగనున్న ఆదాయాలు న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థల నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ఆఫ్‌లైన్ రిటైలర్లకు (బీఎం రిటైల్ స్టోర్స్‌) గణనీయంగా ప్రయోజనం చేకూరనుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో బీఎం రిటైల్‌ స్టోర్స్ ఆదాయం 150-200 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చని, విలువపరంగా చూస్తే ఇది సుమారు రూ. 10,000-12,000 కోట్ల మేర ఉండొచ్చని పేర్కొంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఈ-కామర్స్

‘ఓలా’లో సచిన్‌ బన్సల్‌ రూ.150 కోట్ల పెట్టుబడి

Tuesday 15th January 2019

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ ప్రముఖ ట్యాక్సీ ప్లాట్‌ ఫామ్‌ ఓలాలో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టారు. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వద్ద కంపెనీ సమర్పించిన పత్రాల్లో ఈ మేరకు వివరాలు ఉన్నాయి. 70,588 తప్పనిసరిగా మార్చుకోవాల్సిన క్యుములేటివ్‌ సిరీస్‌ జే ప్రిఫరెన్స్‌ షేర్లను (ముఖ విలువ ఒక్కోటీ రూ.10) సబ్‌స్క్రప్షన్‌ ధర రూ.21,250 చొప్పున ఆయనకు కేటాయించినట్టు ఓలా ఆ పత్రాల్లో తెలియజేసింది. ఈ మొత్తం

Most from this category