STOCKS

News


ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు రూ.35,000 కోట్లు కావాలి: ఇక్రా

Friday 30th November 2018
news_main1543556155.png-22518

ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థలకు వచ్చే నాలుగేళ్లలో భారీ స్థాయిలో నిధుల అవసరం ఉందని, సుమారు రూ.35,000 కోట్ల మేర మూలధనం అవసరం అవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా. పెరిగిపోయిన చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత, తీవ్రమైన పోటీ కారణంగా విమానయాన సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న విషయం తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో విమాన ఇందన ధరలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 35 శాతం మేర పెరిగాయి. డాలర్‌తో రూపాయి 7.8 శాతం క్షీణించింది. దీంతో ఓ కిలోమీటరు దూరానికి ఒక సీటుపై వెచ్చించే వ్యయం పెరిగింది’’ అని ఇక్రా తెలిపింది. సామర్థ్యం పెంపు బాటలో ఉండడం, ధరల పరంగా ఒత్తిడితో కూడిన పరిశ్రమ కావడంతో చాలా వరకు సంస్థలకు రాబడులు తగ్గిపోయయాని తెలిపింది. రానున్న రెండు మూడేళ్ల కాలంలో అధిక సామర్థ్యం సమస్యను ఎదుర్కోనున్నాయని అంచనా వేసింది. 



You may be interested

వెలుగులోకి అటో షేర్లు

Friday 30th November 2018

మార్కెట్‌ ర్యాలిలో భాగంగా గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో అటోరంగ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈలోని అటోరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 1శాతం లాభపడింది. ఉదయం 10:20నిల.కు ఇండెక్స్‌ 0.75శాతం లాభపడి 9,270.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎంఅండ్‌ఎం షేరు 3శాతం లాభపడి అటో ఇండెక్స్‌లో అగ్రస్థానంలో కొనసాగడమే కాక, నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో  ద్వితీయ స్థానంలో

ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్ల విక్రయం

Friday 30th November 2018

న్యూఢిల్లీ: భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ... ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్లను విక్రయించింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల్లో భాగంగా ఫ్యూచర్‌ రిటైల్‌కు చెందిన 1.13 శాతం వాటాకు సమానమైన 57 లక్షలకు పైగా షేర్లను భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అమ్మేసింది. ఈ షేర్లను ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌ రూ.300 కోట్లకు కొనుగోలు చేసిందని బీఎస్‌ఈ బ్లాక్‌ డీల్‌ డేటా వెల్లడించింది. ఒక్కో షేర్‌ సగటు విక్రయ విలువ రూ.525.9 గా ఉంది. ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌నకు చెందిన

Most from this category