STOCKS

News


ఐడీబీఐ బ్యాంకులో వాటా వద్దు

Tuesday 10th July 2018
news_main1531239049.png-18179

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గతంలో ఎల్‌ఐసీ పెట్టుబడుల పనితీరును ఉదహరిస్తూ... ఈ బ్యాంకుల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో తుడిచిపెట్టుకు పోయిందని, అది తమ లాభాలపైనా ప్రభావం చూపుతుందని ఎల్‌ఐసీ క్లాస్‌-1 అధికారుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎల్‌ఐసీ చైర్మన్‌కు లేఖ రాసింది. ‘‘బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ కార్యక్రమంలో పాల్గొనాలని మనల్ని బలవంతం చేస్తున్నారు. ఐడీబీఐలో మెజారిటీ వాటా తీసుకోవడం అన్నది ఈ కోణం నుంచే చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. నివేదికల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎల్‌ఐసీ 2014-15లో రూ.1,850 కోట్లు, 2015-16లో రూ.2,539 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది’’ అని క్లాస్‌-1 అధికారుల ఫెడరేషన్‌ పేర్కొంది. ప్రస్తుతం ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంకుల్లో 11 శాతం వాటా ఉంది. బ్యాంకు మొత్తం రుణాల్లో 35.9 శాతం వసూలు కాని మొండి రుణాలే. మార్చి చివరికి స్థూల నిరర్థక ఆస్తులు రూ.55,588 కోట్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుకు గణనీయమైన నిధుల అవసరం ఉందని ఎల్‌ఐసీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ రాజేష్‌కుమార్‌ అన్నారు. ఐడీబీఐలో వాటా విక్రయానికి ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రయత్నించినా కొనుగోలుకు ఒక్క ప్రైవేటు సంస్థ కూడా ముందుకు రాలేదని గుర్తు చేశారు. తీవ్రమైన ఎన్‌పీఏలతో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ వాటాను గణనీయంగా పెంచుకుంటే, అది పాలసీదారుల పొదుపులపై ప్రభావం చూపుతుందన్నారు. గత కొన్నేళ్లుగా పాలసీలపై బోనస్‌ పెంచడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కుమార్‌ లేఖలో గుర్తు చేశారు. బీమా చట్టంలోని సెక్షన్‌ 35 ప్రకారం బీమా సంస్థ, బీమాయేతర సంస్థను కొనుగోలు చేయడానికి, నియంత్రణకు అనుమతించడం లేదని, దీంతో ఐడీబీఐ బ్యాంకుపై నియంత్రణ తమ చేతుల్లో ఉండదని వివరించారు.You may be interested

రూ.1,212కే విమాన టికెట్‌: ఇండిగో

Tuesday 10th July 2018

ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ తాజాగా ‘మెగా వార్షికోత్సవ సేల్‌’ పేరుతో టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టికెట్లను రూ.1,212 ధర నుంచి అందిస్తోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (జూలై 10 నుంచి 13 వరకు) అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది జూలై 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 మధ్య ఎప్పుడైనా

ఆస్ట్రేలియా వర్సిటీ ఫీజులు ఐసీఐసీఐలో చెల్లించొచ్చు!

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్సిటీలకు ఆన్‌లైన్లో ఫీజులను చెల్లించే సదుపాయాన్ని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆస్ట్రేలియాకి చెందిన వెస్ట్‌ప్యాక్‌ బ్యాంకింగ్ కార్పొరేషన్‌తో (వెస్ట్‌ప్యాక్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆన్‌లైన్ ఫీజుల చెల్లింపు సదుపాయం ముందుగా ‘లా ట్రోబ్’ యూనివర్సిటీలో అందుబాటులో ఉంటుందని, తర్వాత మిగతా వర్సిటీలు, కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఈడీ విజయ్ చందోక్ తెలిపారు. ప్రత్యేక

Most from this category