STOCKS

News


ఐడీబీఐ బ్యాంక్‌లో 7 శాతం వాటా కొనుగోలు చేస్తాం

Wednesday 29th August 2018
news_main1535520093.png-19750

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ను చేజిక్కించుకునే ప్రక్రియలో ఎల్‌ఐసీ మరో అడుగు ముందుకు వేసింది. ఐడీబీఐ బ్యాంక్‌లో అదనంగా మరో 7 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు తమకు ఎల్‌ఐసీ నుంచి ఒక లేఖ అందిందని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. తమ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి ఇప్పటికే 7.98 శాతం వాటా ఉందని,  ఈ వాటాను 14.90 శాతానికి పెంచుకోనున్నామని తాజాగా ఎల్‌ఐసీ తమకు ఒక లేఖ రాసిందని ఐడీబీఐ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. ఈ మేరకు ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల జారీ కోసం వాటాదారుల ఆమోదాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో కోరనున్నామని పేర్కొంది. ఈ విషయమై చర్చించడానికి ఈ నెల 31న డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశమవుతోందని వివరించింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 7.98 శాతం వాటా ఉంది.ఈ వాటాను 51 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 

ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ నిధులు ! 
ఈ వాటా విక్రయం కారణంగా ఐడీబీఐకి భారీ స్థాయిలో నిధులు లభించనున్నాయని నిపుణులంటున్నారు. దీంతో బ్యాంక్‌ మూలధన నిధుల నిబంధనలను అందుకోగలుగుతుందని వారంటున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 85.96 శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌తో ముగిసిన వారానికి ఈ బ్యాంక్‌కు రూ.2,410 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్లుగా ఉన్నాయి. 

ఐఆర్‌డీఏఐ ఆమోదం 
కాగా ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్ఐసీకి బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్‌డీఏఐ ఈ ఏడాది జూన్‌లోనే ఆమోదం తెలిపింది. ప్రస్తుత నిబంధన ప్రకారమైతే, ఏ బీమా సంస్థ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఆర్థిక సంస్థలో 15 శాతానికి మించిన వాటాను కొనుగోలు చేయకూడదు. కానీ ఈ నిబంధన నుంచి ఎల్‌ఐసీకి ఐఆర్‌డీఏఐ మినహాయింపునిచ్చింది. మరోవైపు చాలా కాలంగా బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించాలని ఎల్‌ఐసీ ప్రయత్నాలు చేస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ద్వారా ఎల్‌ఐసీ చిరకాల స్వప్నం నెరవేరనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 2,000 ఐడీబీఐ బ్యాంక్‌ బ్రాంచీలు ఎల్‌ఐసీ పరమవుతాయి. మరోవైపు మొండి బకాయిలు అధికమై, భారీ నష్టాలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌కు ఎల్‌ఐసీ వాటా కొనుగోలు ద్వారా భారీ స్థాయిలో నిధుల సమకూరుతాయి. 22 కోట్లకు పైగా ఎల్‌ఐసీ పాలసీ ఖాతాలు ఐడీబీఐ బ్యాంక్‌కు దక్కుతాయి. ఎల్‌ఐసీ 7 శాతం వాటాను కొనుగోలు చేయనున్నదన్న ప్రకటన వెలువడగానే ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లు 5 శాతం తగ్గి రూ.57.85కు పడిపోయాయి. ఆ తర్వాత కోలుకున్నాయి. చివరకు 1 శాతం నష్టంతో రూ. 60.80 వద్ద ముగిశాయి. 
 



You may be interested

రెండు వారాల గరిష్టం నుంచి పతనం

Wednesday 29th August 2018

న్యూయార్క్‌/ముంబై:- పసిడి ధర బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి పడిపోయింది. అమెరికా-చైనాల మధ్య జరిగిన చర్చలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో పాటు, పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణతో వల్ల ఆసియా మార్కెట్‌లో పసిడి ధర నేలచూపు చూస్తోంది. నేడు ఆసియాలో భారత కాలమాన ప్రకారం ఉదయం 10:00లకు ఔన్స్‌ పసిడి 4.60డాలర్లు నష్టపోయి 1,209.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య రెండురోజుల పాటు

నిఫ్టీ ఫిఫ్టీలోకి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌

Wednesday 29th August 2018

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ నుంచి ఫార్మా షేర్‌ లుపిన్‌ను తొలగిస్తున్నారు. లుపిన్‌ స్థానంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను చేరుస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ ఇండీసెస్‌ లిమిటెడ్‌ తెలిపింది. నిఫ్టీ 50తో పాటు వివిధ సూచీల్లో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నామని తెలిపింది. వచ్చే నెల 28 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వివరించింది. నిఫ్టీ నెక్స్‌ట్‌ 50 సూచీ నుంచి పంజాబ్‌ నేషనల్‌ బ​ఆయంక్‌, కమిన్స్‌ ఇండియా,

Most from this category