STOCKS

News


ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ !

Tuesday 10th July 2018
news_main1531241995.png-18190

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశిస్తున్న ఎల్‌ఐసీ... ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు కోసం బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్‌డీఏఐ ఇటీవలనే ఎల్‌ఐసీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం కూడా పొందిన తర్వాత ఓపెన్‌ ఆఫర్‌కు అనుమతించాలంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీని ఎల్‌ఐసీ  కోరవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టేకోవర్‌ కోడ్‌ నిబంధన ప్రకారం, 25 శాతం, అంతకు మించిన వాటా కొనుగోలు చేస్తే, ఆ తర్వాత తప్పనిసరిగా ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. 



You may be interested

మన్‌పసంద్‌ బేవరేజేస్‌లో తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల వాటా

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: మన్‌పసంద్‌ బేవరేజేస్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తమ వాటాను తగ్గించుకున్నాయి.. ఈ ఏడాది మార్చి నాటికి 21.56 శాతంగా ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)ల వాటా ఈ ఏడాది జూన్‌ నాటికి 13.35 శాతానికి తగ్గింది. నొముర గ్రూప్‌ 4.86 శాతం వాటాను, పార్వెస్ట్‌ ఈక్విటీ 1.07 శాతం వాటాను విక్రయించడం ద్వారా మన్‌పసంద్‌ బేవరేజేస్‌ నుంచి వైదొలిగాయి. మరో ఎఫ్‌పీఐ సంస్థ, ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌

ట్రక్‌ ఈజీలో 26 శాతం వాటా కొనుగోలు చేసిన టాటా మోటార్స్‌

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తొలిసారిగా ఒక స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది. టెక్నాలజీ ఆధారిత ఫ్రైట్‌ అగ్రిగేటర్‌ ట్రక్‌ఈజీలో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది.  టాటా మోటార్స్‌ పూర్తి అనుబంధ సంస్థ టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ హోల్డిం‍గ్స్‌ కంపెనీ ఈ వాటాను కొనుగోలు చేసిందని టాటా మోటార్స్‌ తెలిపింది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ట్రక్కుల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి కోసం చేస్తున్న

Most from this category