STOCKS

News


పతనానికి ముందు పెట్టుబడులు?

Tuesday 18th December 2018
news_main1545123056.png-23046

ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎల్‌ఐసీ నిర్ణయాలు
ఇటీవల కాలంలో భారీగా పతనమైన పలు స్టాకుల్లో సదరు పతనానికి కాస్త ముందుగా ఎల్‌ఐసీ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి చిన్న కంపెనీల్లో పెద్దగా పెట్టుబడులు పెట్టకూడదని ఎల్‌ఐసీ నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయానికి భిన్నంగా కొన్ని చిన్న కంపెనీల్లో వాటాలు పెంచుకోవడం, వెనువెంటనే సదరు స్టాకులు క్రాష్‌ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఎల్‌ఐసీ అనూహ్య పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో వక్రంగీ, గీతాంజలి జెమ్స్‌, ఆమ్‌టెక్‌ ఆటో, మంధన ఇండస్ట్రీస్‌, ఎలెక్ట్రో స్టీల్‌, ఆప్టోసర్క్యూట్స్‌, స్వాన్‌ ఎనర్జీ, గ్రాన్యూల్స్‌ ఇండియా, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఒమాక్స్‌ ఇండియా, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, టాటా కాఫీ, గేట్‌వే డిస్ట్రిక్‌ పార్క్స్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో లిక్విడిటీ మందగించి, వీటిలో వాటాలు ఉన్న హెచ్‌ఎన్‌ఐలు బయటపడే మార్గం కానరాక అల్లాడిపోతున్న వేళ, ఉన్నట్లుండి ఎల్‌ఐసీ ముందుకొచ్చింది. దీంతో ఎల్‌ఐసీ చర్యపై మార్కెట్‌ నిఘావర్గాలు అనుమానంగా ఉన్నాయి. 
బీఎస్‌ఈ 200కు చెందిన కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టాలని ఎల్‌ఐసీ నిర్ణయించుకుందని, కానీ కొన్ని సందర్భాల్లో సాంప్రదాయక పెట్టుబడులు పెట్టాల్సివస్తుందని, ఇందులో భాగంగా కొన్ని చిన్న స్టాకుల్లో వాటలు పెంచుకున్నామని ఎల్‌ఐసీ ఎండీ హేమంత్‌ భార్గవ్‌ చెప్పారు. డౌన్‌ట్రెండ్‌ మార్కెట్లో లిక్విడిటీ కరువైపోయిన స్టాకుల్లో  పెట్టుబడులు పెట్టాలని దేశంలో అతిపెద్ద ఫండ్‌హౌస్‌ నిర్ణయించుకోవడమే విచిత్రమని మార్కెట్‌ వర్గాలు నివ్వెరపోతున్నాయి. దేశీయ ఈక్విటీల్లో ఎల్‌ఐసీ దాదాపురూ.6లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. తాజాగా కొనుగోళ్లు చేసిన చిన్న స్టాకుల వాటాల విలువ దాదాపు 2వేల కోట్ల రూపాయలుంటుంది. ఎల్‌ఐసీ మొత్తం పెట్టుబడులతో పోలిస్తే ఇది చాలా చిన్నమొత్తమని, దీనివల్ల ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో పెద్దగా మార్పులు వచ్చే ఛాన్సులేదని ఇతర ఫండ్‌మేనేజర్లు చెప్పారు. అయితే ఎల్‌ఐసీ ఇలా ఎందుకు చిన్న కంపెనీల్లో వాటాలు తీసుకుందో తెలియట్లేదన్నారు. దీంతో పాటు ఈ వాటాలను అమ్మేందుకు సైతం ఎల్‌ఐసీ యత్నించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఉదాహరణకు వక్రంగీలో ఎల్‌ఐసీ పెట్టుబడులను నాలుగు రెట్లు పెంచుకుంది. కానీ షేరు ధర పడినా వాటాలను విక్రయించలేదు. ఐబీ హౌసింగ్‌లో 11 శాతం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో 3.4 శాతానికి ఎల్‌ఐసీ వాటాను పెంచుకుంది. ఈ విషయమై ఎల్‌ఐసీ నుంచి ఎలాంటి వివరణ ఇంతవరకు రాలేదు.


LIC

You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 10శాతం క్రాష్‌

Tuesday 18th December 2018

టార్గెట్‌ ధర తగ్గింపుతో పాటు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో మంగళవారం జీఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో జీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు రూ.500ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) జీఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు రేటింగ్‌ను ‘‘అండర్‌ఫెర్మ్‌ఫామ్‌’’కు డౌన్‌గ్రేడింగ్‌ చేయడంతో పాటు షేరు ప్రస్తుత ధర నుంచి టార్గెట్‌ ధరను రూ.375లకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం షేరు ఎదుర్కోంటున్న ప్రమాదకర

రూ.1కే బంగారం!!

Tuesday 18th December 2018

బంగారంపై భారతీయులకు మక్కువ ఎక్కువే. గ్రాము బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ.3,200 ఉంది. ఏదైనా జువెలరీ ఔట్‌లెట్‌కు వెళ్లి బంగారం కొనుగోలు చేయాలంటే కనీసం రూ.3,200 వెచ్చించాలి. జువెలరీ షాపులలో గ్రాము కన్నా తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయడం వీలుపడకపోవచ్చు. అందువల్ల ఒకేసారి రూ.3 వేలకు పైగా పెట్టి బంగారం కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్య పడకపోవచ్చు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు అందుబాటులోకి వచ్చింది.

Most from this category