STOCKS

News


ఈ ఏడాది రూ.60,000 కోట్ల ప్రీమియం

Saturday 1st September 2018
news_main1535778973.png-19851

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయం సాధించాలని ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ లక్ష్యం విధించుకుంది. ఇందులో కొత్త పాలసీల ప్రీమియం రూ.6,300 కోట్లుగా నిర్దేశించుకుంది. 2017-18లో రూ.50,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయాన్ని నమోదు చేసినట్లు సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ టి.సి.సుశీల్‌ కుమార్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి పాలసీలను జారీ చేయాలని టార్గెట్‌ విధించుకున్నట్టు చెప్పారు. ‘గతేడాది 8 కొత్త ఉత్పత్తులను విడుదల చేశాం. కొత్తగా మూడు ఉత్పత్తులు ఐఆర్‌డీఏ అనుమతికై ఎదురు చూస్తున్నాయి. ఇక పాలసీలన్నీ డిజిటైజ్‌ చేశాం. కస్టమర్‌కు చెందిన పాలసీలను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పరిశీలించేందుకు సంస్థకు మార్గం సుగమం అయింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘మై ఎల్‌ఐసీ’ యాప్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం’ అని వివరించారు. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.You may be interested

నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను విక్రయించిన రామ్‌కీ

Saturday 1st September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన అనుబంధ కంపెనీ అయిన నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌కు విక్రయించింది. నార్కట్‌పల్లి- అద్దంకి- మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వేలో (నామ్‌) నూరు శాతం వాటా అమ్మకానికై క్యూబ్‌ హైవేస్‌తో షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్టు శుక్రవారం బీఎస్‌ఈకి కంపెనీ సమాచారం ఇచ్చింది. ఈ డీల్‌ ద్వారా రామ్‌కీ రూ.140 కోట్లు పొందడంతోపాటు నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరున ఉన్న

రెరా... రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి !

Saturday 1st September 2018

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడం, కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడం, స్థిరాస్తి లావాదేవీల్లో నిబంధనల అమలును ప్రోత్సహించడం, సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కృషి చేయడం, బిల్డర్లు/డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాలను సత్వరంగా పరిష్కరించడం కోసం రియల్‌ ఎస్టేట్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) అథారిటీ (రెరా) పని చేయనుంది. 500 చదరపు మీటర్లకు పైబడిన లేదా 8 అపార్ట్‌మెంట్లకు మించిన  గృహ/వాణిజ్య ప్రాజెక్టులు/ లే అవుట్లను బిల్డర్లు/ డెవలపర్లు తప్పనిసరిగా

Most from this category