News


ఎల్‌ఐసీ-ఐడీబీఐ డీల్‌పై పిటిషన్‌ తిరస్కృతి

Tuesday 18th December 2018
news_main1545109476.png-23025

న్యూఢిల్లీ: ఐడీబీఐలో (ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) చేస్తున్న ప్రయత్నాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విభూ భక్రూ తిరస్కరించారు. షేర్‌హోల్డింగ్‌లో మార్పు వల్ల ఐడీబీఐకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ హోదా పోతుందని బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. ఇలాంటి పరిస్థితి బ్యాంక్‌ సిబ్బంది ఉపాధిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్‌ఐసీ తన వాదనలు వినిపిస్తూ, బ్యాంకింగ్‌ కార్యకలాపాలు చేపట్టాలని 2000 నుంచీ ఎల్‌ఐసీ యోచిస్తోందని, ఈ ప్రణాళికల్లో భాగంగానే ఐడీబీఐలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నామని తెలిపింది. ఐడీబీఐలో ప్రభుత్వానికి 85.96 శాతం వాటా ఉంది. 2018 జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.2,410 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ దాదాపు రూ.13,000 కోట్లు వెచ్చించనుందని సమాచారం. 



You may be interested

గూగుల్ మ్యాప్స్‌లో ఆటో రిక్షా రూట్లు

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా తమ మ్యాప్స్ యాప్‌లో ఆటో రిక్షా రూట్లను కూడా పొందుపర్చింది. ఏయే ప్రాంతాలకు ఆటోల్లో ప్రయాణించేందుకు ఎంతెంత చార్జీలవుతాయన్నది ఇది ఉజ్జాయింపుగా చూపిస్తుంది. ఆయా రూట్లలో ఆటో చార్జీలపై ప్రయాణికులు ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ఫీచర్ తోడ్పడగలదని గూగుల్ మ్యాప్స్ ప్రోడక్ట్ మేనేజర్ విశాల్ దత్తా తెలిపారు. దీన్ని సోమవారం నుంచి ముందుగా ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారాయన. ఢిల్లీ ట్రాఫిక్

అప్పుడు ఎన్ని నోట్లు ముద్రించారో చెప్పాల్సిందే

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్‌ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్ల ముద్రణ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఆర్‌బీఐ అనుబంధ నోట్ల ముద్రణ విభాగం నిరాకరించింది. 2016 నవంబర్‌ 9 నుంచి అదే నెల 30వ తేదీ మధ్య ఎన్ని రూ.2,000 నోట్లు, రూ.5,00 నోట్లను ముద్రించారో సమాచారమివ్వాలని కోరుతూ హరీందర్‌ దింగ్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సరైన స్పందన

Most from this category