STOCKS

News


గట్టెక్కడానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రైట్స్‌ ఇష్యూ!!

Saturday 29th September 2018
news_main1538212100.png-20713

డిఫాల్ట్‌ సమస్యల నుంచి బయటపడేందుకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. కంపెనీ తన స్వల్పకాలిక ఫండింగ్‌ అవసరాలను అధిగమించడానికి అసెట్స్‌ విక్రయించే అవకాశముంది. ప్రస్తుత 19 రోడ్డు ప్రాజెక్టులలో 14 వాటిని విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై కంపెనీ అటు ఆర్‌బీఐతో, ఇటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు కంపెనీ ఏజీఎం శనివారం ముగిసింది. కంపెనీ ప్రతిపాదిత రూ.4,500 కోట్ల విలువైన రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ అక్టోబర్‌ చివరి నాటికి పూర్తి కావొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో అధిక వాటాలు కలిగిన ఎల్‌ఐసీ, ఓరిక్స్‌ సహా ఎస్‌బీఐ కూడా రైట్స్‌ ఇష్యూలో పాల్గొనవచ్చు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ఎల్‌ఐసీకి 25.34 శాతం, జపాన్‌కు చెందిన ఓరిక్స్‌కు 23.54 శాతం, ఎస్‌బీఐకి 6.42 శాతం వాటాలున్నాయి. ఇక ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌కు దాదాపు రూ.91,000 కోట్ల మేర రుణాలు ఉన్నాయి. ఇందులో బ్యాంకు రుణాలు రూ.57,000 కోట్లు. ఇందులో ప్రభుత్వ బ్యాంకులకు 70 శాతం, ప్రైవేట్‌ బ్యాంకులు 10 శాతం కన్నా తక్కువ వాటాలున్నాయి. ఇక ఎల్‌ఐసీ, విదేశీ బ్యాంకులు మిగిలిన వాటాను కలిగి ఉన్నాయి.



You may be interested

నెలలో 14 లక్షల కోట్లు ఆవిరి

Saturday 29th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ ఒక్క నెలలోనే రూ.14 లక్షల కోట్లు పోగుట్టుకున్నారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 6 శాతానికి పైగా పడిపోయింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల డిఫాల్ట్‌ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ ఆందోళనలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం.  మొత్తం ఇన్వెస్టర్ల సంపద (బీఎస్‌ఈలో లిస్టైన అన్ని స్టాక్స్‌ మొత్తం మార్కెట్‌ వ్యాల్యు) సెప్టెంబర్‌లో రూ.14.48 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.144.86 లక్షల కోట్లకు క్షీణించింది. 2018

7,000లకు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌

Saturday 29th September 2018

భారత్‌లో ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో పోటీ తీవ్రమైంది. షావోమి, రియల్‌మి, ఇన్‌ఫినిక్స్‌, హానర్‌ వంటి కంపెనీలు మంచి ఫీచర్లతో ఫోన్లను తీసుకువస్తున్నాయి. వీటిల్లో రియల్‌మిది పైచేయిగా కనిపిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే రియల్‌మి-1, రియల్‌మి-2 వంటి ఫోన్లతో తన సత్తాను చాటుకుంది. ఇప్పుడు తక్కువ ధరలో రియల్‌మి-సి1 అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఇందులోని ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం..   ♦ 2 జీబీ ర్యామ్‌ ♦ 16 జీబీ మెమరీ ♦ 6.2

Most from this category