STOCKS

News


ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.12,000 కోట్ల ఎల్‌ఐసీ నిధులు !

Saturday 16th February 2019
Markets_main1550296510.png-24216

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ మరో రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొండి బకాయిలకు కేటాయింపుల కోసం ఈ స్థాయి పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తుందని సమాచారం. ఈ విషయమై ఇటీవలనే ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఆర్థిక సేవల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. కాగా తాజా పెట్టుబడుల విషయమై ఎల్‌ఐసీ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 


ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ.21,624 కోట్లు 
ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 51 శాతం వాటాను పొందిన విషయం తెలిసిందే. ఈ వాటా కోసం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ రూ.21,624 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఎల్‌ఐసీ పెట్టుబడులతో ఐడీబీఐ బ్యాంక్‌ కామన్‌ ఈక్విటీ టైర్‌-వన్‌(సెట్‌-1) మూలధనం గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 9.32 శాతానికి పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇదే సమయానికి సెట్‌-1 మూలధనం 6.62 శాతంగానే ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఐడీబీఐ బ్యాంక్‌ నికర నష్టాలు మూడు రెట్లు పెరిగి రూ.4,185 కోట్లకు పెరిగాయి. గత క్యూ3లో రూ.7,125 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.6,191 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 24.72 శాతం నుంచి 29.67 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 16.02 శాతం నుంచి 14.01 శాతానికి తగ్గాయి.



You may be interested

‍స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th February 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి 10762.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10746.55 పాయింట్లతో పోలిస్తే 16పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ లాభంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ లాభాల్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక మనమార్కెట్‌ విషయానికొస్తే ... కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, విదేశీ సంకేతాలు మిశ్రమంగా ఉండటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి

స్టాక్స్‌లో సంపద కూడబెట్టాలంటే... ఇవి తప్పదు!

Saturday 16th February 2019

అధిక రాబడుల ఆకాంక్షతోనే ఎవరైనా స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మరి ఆశించిన మేర రాబడులు తెచ్చుకుంటున్న వారు ఎంతమంది...? చాలా తక్కువ మందే ఉంటారు. రాకేష్‌ జున్‌జున్‌వాలా, రమేష్‌ దమానీ, విజయ్‌ కేడియా, డాలీఖన్నా తదితరుల్లా తాము సైతం భారీగా స్టాక్‌ మార్కెట్లో పోగు చేసుకోవాలనుకుంటే... అందుకు సాధారణంగా ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోదు మరి. ప్రత్యేక క్వాలిటీలతో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్లో భారీగా సంపద

Most from this category