STOCKS

News


ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌

Friday 5th October 2018
news_main1538714229.png-20883

న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌లో 26 శాతం వాటా కొనుగోలు ‍కోసం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గలఒక్కో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ను రూ.61.73 ధరకు 26 శాతం వాటాకు సమానమైన 204 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ఐసీ పేర్కొంది. ఈ మొత్తం ఓపెన్‌ ఆఫర్‌ రూ.12,602 కోట్లని పేర్కొంది. 
కాగా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఎల్‌ఐసీకి షేర్లు జారీ చేస ప్రతిపాదనకు ఐడీబీఐ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఫలితంగా ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీకి మార్గం సుగమం అవుతుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా పెంచుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ.8,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనకు కూడా ఐడీబీఐ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా ఎల్‌ఐసీని ప్రమోటర్‌ సంస్థగా వర్గీకరించే ప్రతిపాదనకు కూడా డైరెక్టర్ల బోర్డ్‌ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బ్యాంక్‌ నిబంధనల్లో మార్పులు చేయాలన్న ప్రతిపాదనకు కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. 


 



You may be interested

స్థిరంగా పసిడి ధర

Friday 5th October 2018

పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ రెండేళ్ల గరిష్టానికి చేరుకోవడం, నేడు అమెరికా ఉద్యోగ గణాంకాలు విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఎదురుచూపులు ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి 0.80 డాలర్ల లాభంతో 1,202.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రానున్న రోజుల్లో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతో డాలర్‌ బలపపడంతో

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్ పరిరక్షణకు చర్యలు..

Friday 5th October 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ విలువను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బోర్డు పేర్కొంది. వ్యవస్థాగతంగా కీలకమైన సంస్థను గట్టెక్కించే ప్రణాళిక రూపకల్పన కోసం తరచూ భేటీ కానున్నట్లు తెలిపింది. గురువారం తొలిసారిగా భేటీ అయిన కొత్త బోర్డు దాదాపు అయిదు గంటల పాటు కంపెనీ వ్యవహారాలపై చర్చించింది. గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇతర వాటాదారులతో కూడా తగు సమయంలో భేటీ

Most from this category